భవన నిర్మాణ కూలీల సమస్యపై ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో అవగాహన లేదన్న అభిప్రాయం.. నిన్న ఇసుక కొరతపై సమీక్షలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు విన్నవారికి ఏర్పడుతోంది. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవనడం సరి కాదని.. జగన్ అధికారులతో వ్యాఖ్యానించారు. అంతే కాదు.. గత ప్రభుత్వ హయాంలో.. పనులున్నాయి.. ఇప్పుడు లేవనడం కూడా కరెక్ట్ కాదన్నారు. అప్పుడూ పనుల్లేవు..ఇప్పుడూ లేవన్నట్లుగా జగన్ వ్యాఖ్యానించడం.. సమస్య అప్పటిదేనని చెప్పుకోవడానికి జగన్ ప్రయత్నించడంతో అవాక్కవడం… వినేవారు వంతయింది. అంతే కాదు కూలీలకు ఉపాధి సమస్యను .. పరిష్కరించడానికి ఆయన ఓ వినూత్న ఉపాయం కూడా చెప్పారు.
ఉపాధి లేని కూలీలందర్నీ..ఇసుక రీచ్‌లలో పనుల్లో పెట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం.. యంత్రాలతో ఇసుక తీయకూడదు కాబట్టి.. ఎంత మంది కూలీలు ఉంటే.. అంత మందిని పనుల్లో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. దీనికి గ్రామ సచివాలయాలను ఉపయోగించుకోవాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఎంత మంది ఉపాధి కోసం వస్తే.. అందరికీ.. రీచ్‌లలో కూలీ కల్పించాలన్నారు. ఈ ఆదేశాలు విని.. అధికారులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో పని చేసే కూలీలకు ఇసుక రీచ్‌లలో ఎలా ఉపాధి కల్పించారో తెలియక… అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఇసుకపై సమీక్షలో ముఖ్యమంత్రి… గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాలా ఉండేదని.. దాన్ని నిర్మూలించామని ప్రకటించుకున్నారు. మరి.. ఏపీలో బ్లాక్‌లో.. ట్రాక్టర్ పదివేలకు అమ్ముతున్న విషయం.. పక్క రాష్ట్రాలకు తరలి పోతున్న వ్యవహారం గుర్తుకు వచ్చిందేమో కానీ.. ఇలాంటి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నాననంటూ.. చెప్పుకొచ్చారు.
వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించి ఇసుక సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చిన.. కొత్త విధానం వచ్చిన తర్వాతే.. అలాంటి ఆలోచన ఎందుకు చేయలేదనే ప్రశ్నలు కార్మిక వర్గాల నుంచి వస్తున్నాయి. మొత్తానికి కూలీలు, ఉపాధి విషయంలో జగన్మోహన్ రెడ్డికి తన తక్కువ అనగాహన ఉందని… సమస్య తీవ్రతను ఆయన అర్థం చేసుకోలేకపోయారన్న అభిప్రాయం.. అధికారవర్గాల్లో ఏర్పడింది.