ఐదేళ్లలో ఏపీని సాంతం నాకేసిన జగన్ రెడ్డి .. చివరిలో క్లియరెన్స్ సేల్ .. క్లియరెన్స్ తాకట్టులు ప్రారంభించారు. ఇందు కోసం.. అసలు ఏమేమి మిగిలిపోయాయో చిట్టా తీయాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం ఓ ప్రత్యేక యాప్ తీసుకు వచ్చారు. కార్పొరేషన్లు.. వాటిలో తాకట్టు పెట్టకుండా ఉన్న ఆస్తుల వివరాలను ఇవ్వాలని కోరారు. ఇప్పుడు వాటిని అడ్డగోలుగా తాకట్టుపెట్టేసి… అప్పులు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుస్తారో లేదో కానీ.. అస్మదీయ కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లించడానికి ఇప్పటికే ఎన్నో అప్పులు తెచ్చారు. ఇంకా సరిపోలేదు. అనేక పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. కనీసం ఇరవై వేల కోట్లు పథకాలకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. బటన్ నొక్కినా డబ్బులు పడలేదు. ఫీజు రీఎంబర్స్ మెంట్ నాలుగు నెలులుగా పెండింగ్ పడుతోంది. చేయూత పథకం అపేశారు. ఎన్నికలకు ముందు అయినా బటన్ నొక్కాలంటే డబ్బులు కావాలని తాపత్రయ పడుతున్నారు.
రిజర్వు బ్యాంక్ వద్ద వారానికి మూడు వేల కోట్లు అప్పు తెస్తున్నా సరిపోవడం లేదు. వెళ్లే ముందు అడుగుబొడుగూ ఆస్తులు కూడా లేకుండా చేసి పోవాలని గట్టి పట్టుదలగా జగన్ రెడ్డి ఉన్నారని ప్రభుత్వంలోనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భూములు అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టేస్తున్నారు. బినామీలకు వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. పనులు చేయకుండానే బిల్లులు చెల్లించారు. చివరికి చిల్లిగవ్వ ఆస్తి లేకుండా తాకట్టు పెట్టేస్తున్నారు. ప్రైవేటు ఆస్తులేమైనా తాకట్టు పెట్టారేమో ప్రభుత్వం మారితే కానీ లేకపోతే టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు వచ్చినట్లుగా ప్రైవేటు ఆస్తిపరులకు నోటీసులు వస్తే కానీ తెలియదు.