మాజీలయిన మంత్రులను మంత్రి పదవులు అశించిన వారికి అభివృద్ధి మండళ్ల బాధ్యతలు ఇస్తామని వారందరికీ కేబినెట్ హోదా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే స్టేట్ డెలవప్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తామని దానికి కొడాలి నానిని చైర్మన్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు జిల్లాల వారీగా బోర్డుల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. 11 జిల్లాలకు మంది మాజీ మంత్రులు వీటికి చైర్మన్లుగా నియమితులవుతారు. మరో 15 జిల్లాలకు మంత్రులుగా అవకాశం వస్తుందని ఆశపడ్డ వారికి కూడా చైర్మన్లుగా అవకాశం లభించనుంది.
ఈ చైర్మన్లందరికీ ప్రోటోకాల్ ఉంటుంది. కేబినెట్ హోదా ఉంటుంది. కానీ నిధులు.. విధుల గురించి స్పష్టత ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం జిల్లాల్లో జిల్లా ప్రణాళికా కమిటీలు, జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీలు ఉన్నాయి. ఇరదులో ప్లానిరగ్ కమిటీలు పంచాయితీరాజ్ శాఖ అధ్వర్యంలో పనిచేస్తురడగా, డిడిఆర్సిలకు కలెక్టర్లు చైర్మన్లుగా ఉంటున్నారు. అయితే ఇవన్నీ సమీక్షలు చేయడానికి తప్ప మరో అధికారం లేదు. అదే సమయంలో ఇంచార్జ్ మంత్రుల వ్యవస్థ కూడా ఉంది.
ఓ వైపు జిల్లా మంత్రి.. ఇంచార్జ్ మంత్రికి తోడు కొత్తగా అభివృద్ధి మండలి చైర్మన్ కూడా వస్తే అది మరినని సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఒక మంత్రి తన శాఖకు రాష్ట్రంలో అధిపతిగా ఉరటూనే, ఒక్కో జిల్లాకు ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా కూడా ఇన్ఛార్జ్ మత్రుల చేతుల మీదుగానే జరగాల్సి ఉంటుంది. జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా తమకు కావాల్సిన పనులకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారానే సంతకాలు చేయిరచుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఈ బాధ్యతలు డిడిసి చైర్మన్లుగా వ్యవహరిరచే వారికి ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ జిల్లా మంత్రులు డమ్మీలుగా మారిపోతారు.
అయితే రాష్ట్ర స్థాయి మంత్రి పదవికి.. జిల్లా స్థాయి పదవికి చాలా తేడా ఉందని కొంత మంది వైసీపీ సీనియర్లు గొణుక్కుంటున్నారు. పైగా నిధులు.. విధులు ఉండని పోస్టులతో అగౌరవమేనని వద్దని అనుకుంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.