కుప్పం వెళ్లి అక్కడి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెబతారు జగన్ రెడ్డి, అక్కడ చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని జగన్ ఆయన మాటల్ని కామెడీ చేస్తారు. అయినా జగన్ పట్టించుకోరు.. పిఠాపురం వచ్చి అవే కబుర్లు చెప్పారు. వంగాగీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంను చేస్తారట. ముందు ఆయన గెలవాలి కదా అన్న విషయాన్ని పక్కన పెడితే… రెండు విడతలుగా ఆయన హయాలంో పది మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఈ విషయం ఆయనకైనా గుర్తుందో లేదో. వైసీపీలో రెడ్లు తప్ప.. ఏ వర్గానికి చెందిన వారైనా పదవి ఇస్తారు అంతే.. పవర్ మాత్రం ఇవ్వరు. కనీసం తమ చాంబర్ లోకి అడుగు పెట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సిందే.
ఈ పవర్ లెస్ డిప్యూటీ సీఎం గురించి పక్కన పెడితే గతంలో ఇలాంటి హామీలు ఇచ్చి పలువుర్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి. భీమవరంలో పవన్ కల్యాణ్ ను ఓడిస్తే.. గ్రంధి శ్రీనివాస్ ను మంత్రిని చేస్తానని చెప్పారు. కానీ ఆయన ఎదురుచూస్తూనే ఉన్నారు. అదేసమయంలో లోకేష్ ను ఓడించి ఆళ్లను గెలిపిస్తే ఆయననూ మంత్రిని చేస్తానని అక్కడి ప్రచారసభల్లో చెప్పారు. ఐదేళ్లలో కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. చిలుకలూరిపేటకు వెళ్లి విడదల రజనీని గెలిపిస్తే.. మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రి పదవి ఇస్తానని చెప్పుకొచ్చారు. అన్నీ ఐదేళ్లలో గాలికి కొట్టుకుుపోయాయి.
ఇవన్నీ ప్రజలకు గుర్తుండవని అనుకుంటున్నారేమో కానీ కొత్తగా ఈ ఎన్నికల్లోనూ పాత పాటే ప్రారంభించారు. పిఠాపురంలో ఓటుకు ఐదు వేలు పంచినా డబ్బులు దండగేనని వైసీపీ వర్గాలే ఓ క్లారిటీకి వచ్చాయి. జగన్ ప్రచారంచివరి రోజు సభకు.. సాయి ధర్మతేజ ప్రచారానికి వచ్చినంత మంది కూడా రాలేదు. గెలిస్తే ఇస్తామో లేదో తర్వాత ముందు గెలవాలన్నట్లుగా జగన్ గతంలో తన మాటల్ని గుర్తు చేసుకుని నవ్వుకుంటారని తెలిసినా ప్రకటనలు చేస్తున్నారు.