కేసు ఏదైనా సరే… కొన్నిసార్లు స్టేషన్ బెయిల్ వస్తుంది. కొన్ని సెక్షన్లపై కోర్టులు బెయిల్ ఇస్తాయి. బెయిల్ వచ్చిందంటే అర్థం ఆ కేసు తప్పని తేలినట్లేనా? ఆ కేసు కొట్టేసినట్లేనా…?
ఈ కేసుల విషయంలో ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా కాదు అనే అంటారు. కానీ పులివెందుల ఎమ్మెల్యే జగన్ మాత్రం కేసే ఉండదన్నట్లుగా వాదిస్తున్నారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అందరు చూస్తుండగానే పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డ్ అయ్యింది. అధికారుల ముందే ఈవీఎంను ధ్వసం చేయటం, టీడీపీ ఏజెంట్ ను బెదిరించటం కనపడింది. పిన్నెల్లి వచ్చే వరకు అక్కడ పోలింగ్ స్టేషన్ అంతా ప్రశాంతంగానే ఉంది.
సీసీటీవీ రికార్డ్ బయటకు రావటం… ఈసీ సీరియస్ కావటం, పోలీసులు కేసు పెట్టడంతో… అరెస్ట్ భయంతో తెలంగాణలో పిన్నెల్లి తలదాచుకోవటం… ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు వెటాడటం జరిగాయి. తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయగా, విచారణ కొనసాగుతుంది. ఎన్నికల అల్లర్ల కేసుల్లో బెయిల్ రాకపోవటంతో పిన్నెల్లి జైల్లో ఉన్నారు.
జైల్లో పిన్నెల్లిని కలిసిన జగన్… అన్యాయంగా కేసులు బనాయించారంటూ వెనుకేసుక రావటం, అతనిది తప్పే కాదని వితండవాదంగా మాట్లాడటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.