జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ ను నమ్ముకోవడం లేదు. వారికి ఇవ్వాల్సిన బిల్లులు… గౌరవం గురించి ఆలోచించడం లేదు. పార్టీ కార్యకర్తల పేరుతో డబ్బులిచ్చి జనాలను తరలించుకునే పరిస్థితి వచ్చినా ఆయన తన మూఢనమ్మకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వాలంటీర్లే గెలిపిస్తారన్నట్లుగా వారికి తాయిలాలు పెంచుతున్నారు. ఇందు కోసం వారంటీర్లకు ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా పెట్టిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభ్యర్థులతో గిఫ్టుల పంపిణీ చేపడుతున్నారు.
వాలంటీర్ల పేరుతో ప్రతీ ఏటా 70 కోట్లను ఎఫ్ఏవో అనే సంస్థకు ఇస్తున్నారు. ఆ సంస్థ కడప జిల్లాకు చెందిన రెడ్లది. వారి ప ని .. వాలంటీర్లు సేకరించే సమాచారాన్ని క్రోడీకరించి .. ఓటర్లను ఎలా బెదిరించాలో.. ఎలా బ్లాక్ మెయిల్ చేయాలో మళ్లీ వాలంటీర్లకే ట్రైనింగ్ ఇవ్వడం. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడటంతో వారు పూర్తి స్థాయి ట్రైనింగ్ లోకి దిగిపోయారు. వాలంటీర్లకు ఎన్నికల ప్రచారం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. జగన్ రెడ్డికి మళ్లీ ఓటేయాలని.. ఏ విధంగా ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలో శిక్షణ ఇస్తున్నారు. వ్యక్తిగత సమాచారం సేకరించి ఉండటంతో బెదిరింపులకూ దిగేలా ప్లాన్ చేస్తున్నారు.
వాలంటీర్లు మొత్తం వైసీపీ వారే. కానీ వారిలోనూ మార్పు కనిపిస్తోంది. జగన్ రెడ్డి కోసం తాము ఎందుకు తప్పు చేయాలన్న ఆలోచనకు వస్తున్నారు. ఎక్కువ మంది వైసీపీ కోసం పని చేయడానికి నిరాకరిస్తున్నారు. అలాంటి వారిని తీసేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇటీవలి కాలంలో వాలంటీర్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. కొంత మంది మానేస్తున్నారు. ఉన్న వాళ్లు కూడా మొక్కుబడిగా పని చేస్తున్నారు. అయితే వారికి గిఫ్టులు ఇస్తారంటూ మభ్యపెడుతున్నారు. కొన్ని చోట్ల దోపిడీకి పాల్పడిన ఎమ్మెల్యేలు.. రెండు, మూడు వేల రూపాయల కుక్కక్లు ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వాలంటీర్ల వ్యవహారంపై వైసీపీలోని కింది స్థాయి క్యాడర్ అసంతృప్తికి గురవుతోంది. వాలంటీర్ల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ పార్టీ కార్యకర్తలే తమకు ఓటు వేయడం లేదని.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తేలినా లైట్ తీసుకుని..కన్వీనియంట్‌గా తమను తాము మోసం చేసుకుంటోంది.