తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్..చంద్రబాబుకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్..జగన్‌కు.. పక్కాగా..సూపర్ స్టార్ గిఫ్ట్‌గా అందింది. ఎంపీ స్థానాల్లో… వైసీపీకి దక్కేసీట్లతో కలిపి.. టీఆర్ఎస్కు వచ్చే పదహారు సీట్లతో మిక్స్ చేసి… 40 సీట్లు అవుతాయని … ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకున్నారు. అందుకే.. వైసీపీ నేతలకు.. టీఆర్ఎస్ నేతలు కావాల్సినంత సహకారం అందించారు. అది ప్రత్యక్షంగా.. పరోక్షంగా అందింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి… ఇరవై మూడు వరకూ పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారు. అత్యధికంగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. అయితే… జగన్ కు ఉపయోగపడిన రిటర్న్ గిఫ్ట్… కేసీఆర్ కు మాత్రం ఉపయోగపడే అవకాశం ఎంత మాత్రం లేదు.
కేంద్రంలో బీజేపీకి… సంపూర్ణ మెజార్టీ వచ్చింది. అదనంగా మిత్రపక్షాలు కూడా ఉన్నారు. ఇతర పార్టీల మద్దతు అవసరం అయ్యే ప్రశ్నే లేదు. కాబట్టి.. వైసీపీకి వచ్చిన ఎంపీలతో.. టీఆర్ఎస్ చేసేదేమీ కూడా లేదు. అయితే.. జగన్ కు … 23 ఎంపీ సీట్లు వచ్చినప్పటికీ.. టీఆర్ఎస్ కు మాత్రం.. తెలంగాణలో షాక్ తగిలింది. ఆ పార్టీ పదహారు సీట్లు సాధిస్తుందనుకుంటే… సగానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు వైసీపీనే తన కన్నా.. మూడు రెట్లు అధికంగా సీట్లు సాధించి.. పెద్ద పార్టీగా మారగా… టీఆర్ఎస్ మాత్రం జూనియర్ పార్టీగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం.. టీఆర్ఎస్ సాధించిన సీట్ల కన్నా.. మిన్నగా… వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు… రిటర్న్ గిఫ్ట్ వల్ల.. కేసీఆర్ కు.. ఏదైనా లాభం మిగిలిందా.. అంటే… రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబును.. ఓడించడం ఒక్కటే.
ఇప్పుడు.. ఏ విధంగా చూసినా.. టీఆర్ఎస్ కన్నా పెద్ద పార్టీ అయిన వైసీపీ… కేసీఆర్… ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏం చేసినా..మాట్లాడకుండా ఉండే సందర్భం ఉండదు. ఇది … టీఆర్ఎస్ కు ఇబ్బందికరమే. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్… ఆయనకు నష్టమే కలిగించింది. జగన్ కు.. మాత్రం పక్కాగా లాభం కలిగించిందని అనుకోవాలి.