వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు ప్రేమ ముంచుకొచ్చిది. హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఏదో మొక్కుబడిగా పెట్టినట్లుగా ఉందని ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి ఈ సారి కూడా జగన్ పెట్టాలనుకోలేదు..పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. షర్మిల అదే చేశారు మరి.
షర్మిల తల్లి పుట్టిన రోజును గుర్తుంచుకుని మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో తల్లి గురించి కాస్త ఎమోషనల్ గా గుర్తు చేసుకుని హ్యాపీ బర్త్ డే అమ్మ పోస్టు పెట్టారు. అందరూ షర్మిల పెట్టారు సరే.. మరి జగన్ చెప్పారా అని వెదకడం ప్రారంభించారు. గంట తర్వాత వారి వెదుకులాటకు జగన్ ట్విట్టర్ హ్యాండిల్ లో సమాధానం లభించింది. హ్యాపీ బర్త్ డే అమ్మా అని పోస్టు కనిపించింది.
చెల్లికి అన్యాయం చేయడంతో షర్మిలతో పాటు ఉంటున్నారు విజయమ్మ. ఆయితే ఏపీలో ఎవరికి ప్రచారం చేయాలన్నది సమస్యగా మారింది. షర్మిల వైపు మనసు లాగుతున్నా.. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయలేక అమెరికా వెళ్లిపోయారు. షర్మిల కుమారుడితో పాటు అమెరికాలో ఉంటున్నారు. అందుకే రాయితో జగన్ ను కొట్టిన ఘటన తర్వాత పరామర్శించడానికి రాలేదు. జగన్ తీరు విజయమ్మ విషయంలో అభ్యంతరకంగా ఉందన్న విమర్శలు రావడంతో ఇటీవల ఆమె సపోర్ట్ తనకే ఉందని చెప్పుకునేందుకు జగన్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.