పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను చేయడం సంప్రదాయంగా వస్తోంది. గురువారం పీఏసీ చైర్మన్ ఎంపిక ప్రక్రియను స్పీకర్ పూర్తి చేస్తారు. కేబినెట్ ర్యాంక్ కోసం అల్లాడిపోతున్న జగన్ రెడ్డి పీఏసీ చైర్మన్ గా తమ పార్టీ తరపున తన పేరునే సిఫారసు చేయించుకుంటే..ఆయన కోరిక నెరవేరవచ్చని భావిస్తున్నారు. ఈ అంశంపై వైసీపీ సలహాదారులకు ఇంకా బుర్ర తట్టలేదో లేకపోతే సీఎంగా చేసి పీఏసీ చైర్మన్ గా చేయడం ఏమిటని జగన్ కూడా వద్దనుకున్నారో కానీ ఇప్పటి వరకూ స్పష్టత లేదు.
అయితే పీఏసీ చైర్మన్ పదవికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అదేమిటంటే.. సభ్యుల నుంచి ఎన్నికవ్వాలి. ఒక్క సభ్యుడు విజయం సాధించాలంటే కనీసం పది శాతం ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి . అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి.వైసీపీకి పదకొండు మంది మాత్రమే ఉన్నారు. అంటే ఒక్క సభ్యుడు కూడా విజయం సాధించరు. పీఏసీ చైర్మన్ గా ఎమ్మెల్యేను మాత్రమే ఎన్నుకుంటారు. కానీ సభ్యులుగా ఎమ్మెల్సీలు ఉండవచ్చు. గత ప్రభుత్వంలో టీడీపీకి ఇరవైకి పైగా సభ్యులు ఉన్నారు. దాంతో ఒక్క సభ్యుడు అయిన పయ్యావుల గెలిచారు. సంప్రదాయం ప్రకారం ఆయనకే పీఏసీ చైర్మన్ పదవి వచ్చింది.
ఇప్పుడు వైసీపీ తరపున ఒక్కరు కూడా గెలిచే చాన్స్ లేదు కాబట్టి.. ఆ పార్టీ సభ్యులకు పీఏసీ చైర్మన్ చాన్స్ రాదు. మండలిలో ఉన్నా.. మండలి సభ్యులకు ఇవ్వరు. అందుకే ఇప్పుడు ఆ పదవి ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ తప్ప అసెంబ్లీలో మరో కూటమి లేదు. అందుకే ఆ పదవిని కూడా అనివార్యంగా కూటమి ఎమ్మెల్యేకే కేటాయించక అప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
జగన్ రెడ్డి చేసిన విధ్వంసక పాలన దెబ్బకు..వైసీపీ పాతాళంలోకి పడిపోయిది. ఇప్పుడు అసెంబ్లీకి కూడా వెళ్లకూడదని ఆయన తీసుకున్న నిర్ణయంతో వైసీపీపై మట్టిపోస్తున్నారు..ఇక బయటకు రావడం కష్టమే అనుకోవచ్చు.