వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడుగా అరెస్టులు చేస్తూండటం సీఎం జగన్ పర్యటనలపై ప్రభావం చూపుతుంది. సోమవారం అనంతపురం జిల్లా శింగనమల వెళ్లి వసతి దీవెన బటనొక్కాల్సి ఉంది. కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత షెడ్యూల్ మారిపోయింది. టూర్ క్యాన్సిల్ అయిందని ప్రకటించారు. దీనికి అనివార్య కారణాలు అని చెప్పారు. మరి విద్యార్థులకు ఇవ్వాల్సిన నగదును అకౌంట్లలో జమ చేస్తారా అంటే.. అలాంటిదేమీ లేదని… మళ్లీ బటన్ నొక్కే ప్రోగ్రాం 26వ తేదీన పెడతారని అప్పుడు మాత్రమే విద్యార్థుల అకౌంట్లలో నగదుపడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
మరో వైపు జగన్ ఈ నెల 21వ తేదీ నుంచి విదేశీ పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. వారం రోజుల పాటు లండన్ లో చదువుకుంటున్న కుమార్తె వద్దకు వెళ్లి .. అటు నుంచి యూరప్ టూర్ కు వెళ్లి వస్తారని సీఎంవో వర్గాలు చెప్పాయి. ఆ ప్రకారం చూస్తే… జగన్ ఇరవై ఆరో తేదీన అనంతపురం పర్యటనకు వెళ్లడం కష్టమే . అంటే అప్పుడు కూడా మీట నొక్కేది ఉండదు. విదేశీ పర్యటన నుంచి వస్తే ఉండవచ్చు. అసలు సోమవారం పర్యటన ఎందుకు ఆగిపోయిందన్నది ఎవరికీ తెలియడం లేదు.
అని వార్య కారణాలు అని చెప్పినప్పటికీ.. ఆ అనివార్య కారణాలేమిటన్నది చర్చనీయాంశంగా మారింది. నిధుల్లేకపోవడం ఓ కారణం అని.. ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం పడొచ్చనేది మరో కారణం కావొచ్చని అంచనా వేస్తున్నారు. పర్యటనలు రద్దు చేసుకుని జగన్.. తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో కూర్చుని చేసేదేమీ ఉంటుందని అంటున్నారు. మొత్తంగా ఇలాంటివి ఏవైనా జరిగినప్పుడు సీఎం జగన్ మూడాఫ్ అయిపోతుందేమో కానీ బయటకు రారు.. పర్యటనలు రద్దు చేసుకుంటూ ఉంటారు.