శాసనమండలిలో.. పాలనా వికేంద్రీకరణ బిల్లును ఆమోదించకపోతే.. మండలిని రద్దు చేస్తామంటూ ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. దీన్ని లెక్క చేయడం లేదు. చేస్తే చేసుకోమని.. చెబుతున్నారు. దాంతో.. మండలి వ్యవహారం.. ఎటూ తేలడం లేదు. నిజానికి మండలిని రద్దు చేయడం అనేది అంత తేలిక కాదు. జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్న 151 మంది ఎమ్మెల్యేలతో.. రద్దు చేసేయడం సాధ్యం కాదు. దానికో ప్రక్రియ ఉంటుంది. అది రాజ్యాంగ సవరణ వరకూ ఉంది. ముందుగా.. కేబినెట్లో నిర్ణయం తీసుకుని.. అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదం పొందాలి.
ఇక్కడి వరకూ జగన్మోహన్ రెడ్డి.. తను అనుకున్నది అనుకున్నట్లుగా చేయగలరు. కానీ.. వెంటనే అసెంబ్లీ రద్దు కాదు.. దానికో లెక్క ఉటుంది. ఈ బిల్లును పార్లమెంట్‌కు పంపాలి. పార్లమెంట్ ఉభయసభలు.. ఏపీలో శాసనమండలి రద్దును ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ కూడా అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ.. శాసనమండలి రద్దు కావడం అనేది జరగదు. ఈ ప్రక్రియ మొత్తం జరిగే సరికి.. దాదాపుగా ఏడాది పట్టే అవకాశం ఉంది. కేంద్రం సహకరించకపోతే.. అసలు జరగకపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నిజానికి మరో ఏడాది.. ఏడాదిన్నర వేచి చూస్తే.. వైసీపీకే మండలిలో మెజార్టీ వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు… మండలి రద్దు నిర్ణయం తీసుకున్నా.. అమల్లోకి వచ్చే సరికి అంత సమయం పడుతుంది. అందుకే.. వైసీపీ మండలి రద్దు నిర్ణయాన్ని తీసుకోదని.. ఊరకనే బెదిరింపులకు పాల్పడుతోందని.. ఎమ్మెల్సీలు కూడా నమ్ముతున్నారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి స్టైల్ వేరు కాబట్టి.. ఎవరేమనుకున్నా.. రద్దు చేయాలి అనుకుంటే.. ఆయన రద్దు చేసేస్తారు కాబట్టి.. ఆ ఆప్షన్‌ను కూడా కొట్టి పారేయలేమంటున్నారు. మొత్తానికి మండలి.. అలా ఊగిసలాడుతోంది.