జగన్ రెడ్డి బుర్ర ఎంత బురదలో ఉంటుందో బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. జగన్ రెడ్డి తన కుటుంబాన్ని రోడ్డున పడేసుకున్నారు. వారితోనే ఇష్టం వచ్చినట్లుగా తిట్లు తింటున్నారు. వారిని తన సోషల్ సైకోలతో తిట్టిస్తున్నారు. మనిషి అనే లక్షణాలు ఉన్న ఎవరైనా ఇలా చేయరండి బాబూ అని సామాన్యులు సైతం ఆశ్చర్యపోయేంతగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ఇది నిజమేనని తాజాగా చంద్రబాబు తల్లిదండ్రుల ప్రస్తావన తీసుకు వచ్చి మరోసారి నిరూపించారన్న విమర్శలు వస్తున్నాయి.
తల్లిదండ్రుల్ని చంద్రబాబు చూడలేదనడం.. వారికి అన్నం పెట్టలేదని ఆరోపించాలంటే.. మామూలు స్థాయి వ్యక్తులకు సాధ్యం కాదు. గతంలోకాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని చెప్పిన మానసిక స్థితి ముదిరి పిచ్చిగా మారుతున్న లక్షణాలకు ఇది సంకేతం అనుకోవచ్చని ఎవరైనా అంటే అందులో తప్పేం ఉండదు. చంద్రబాబు తల్లిదండ్రులు ఎప్పుడూ కుమారుడు రాజకీయాల పదవుల్ని చూసి రాజభోగాలు అనుభవించాలనుకోలేదు. కుమారుడు విజయాలను చూపి పొంగిపోయారు కానీ.. మాకేంటి అని ఆశించని వారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా పొలం పనులు చూసుకునేవారు.
సొంత ఊరుని దాటి బయటకు వెళ్లడం వారికి ఇష్టం లేదని అందరికీ తెలుసు. ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మలను ప్రజలకు పరిచయం చేయలేదని జగన్ చెబుతున్నారు. పరిచయం చేయడం అంటే బహిరంగసభ పెట్టి వీరు నా తల్లిదండ్రులు అని చెప్పాలా ?. ఈ రోజున చంద్రబాబు తల్లిదండ్రులు ఎవరు అటే… ఖర్జూనరనాయుడు, అమ్మణ్మమ్మ అని ప్రతి ఒక్కరూ చెప్పరా ?. అంత కంటే వారికి కుమారుడిగా సాధించి పెట్టే గుర్తింపు ఏముంటుంది ?
తల్లి, చెల్లిని ఘోరంగా అవమనిస్తున్నారు .. వారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి జగన్ మానసిక స్థితి, మనస్థత్వాలను బయటి పెట్టడానికి చంద్రబాబు , టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ఆపుకోవడానికి ఆయన చంద్రబాబు తల్లిదండ్రులపై పడుతున్నారు. ఇంత ఘోరమైన మనస్థత్వం ఉన్న రాజకీయ నేత మరెక్కడా ఉండలేరేమో ?