2014 ఎన్నికల్లో ఓడిపోగానే… వెంటనే నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి వచ్చారు. చంద్రబాబు ఏమీ చేయలేదంటూ ప్రచారం ప్రారంభించారు. తాను రాగానే చేస్తానంటూ నవరత్నాలు ప్రకటించారు. అందులో ఒకటి రైతు భరోసా. ఒకే సారి రూ. 12,500 రైతులకు మేలో ఆర్థిక సాయం చేస్తానని… పెట్టుబడి సాయం ఇస్తానని .. మాట తప్పనని… ఎన్నికల సభల్లో దీర్ఘాలు చేసి మరీ నవరత్నాల్లో ఒక రత్నం హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక నిట్ట నిలువుగా మోసం చేశారు.
రూ. 12500 కాస్తా రూ. 7500 కి మార్పు
జగన్ గెలిచిన వెంటనే ఒక్క సారే రూ. 12500 పడతాయనుకుంటే… రైతుల ఖాతాలో పడింది ఎంతో తెలుసా.. కేవలం రెండు అంటే రెండు వేలు. గెలిచిన తర్వాత రైతుల్ని బోడిమల్లయ్యల్ని చేశారు. రైతు భరోసా అమలు దగ్గరకు వచ్చేసరికి.. ఆ రత్నాన్ని మూడు ముక్కలుగా నరికి.. మూడు విడతలుగా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తామంటున్న మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కాదు. ఇందులోనే కేంద్రం ఇచ్చే రూ. ఆరు వేలు ఉంటాయి. కేంద్రం ఇచ్చే రూ. ఆరు వేలు… తామే ఇస్తున్నట్లుగా ఏపీ సర్కార్.. ఈ విధంగా ప్రచారం చేసుకుంటోంది. అక్కడ మోదీ బటన్ నొక్కినప్పుడు రైతుల అకౌంట్లలో డబ్బులు పడతాయి. మరి జగన్ ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు.
మోదీ పథకం ప్రకటించక ఏడాదిన్నర ముందు నుంచే రూ. 12500 ప్రకటనలు
కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకాన్ని 2014 ఎన్నికలకు ముందు ప్రవేశ పెట్టింది. రూ. ఆరు వేలు రైతుల అకౌంట్లలో మూడు విడతలుగా వేయడం ప్రారంభించింది. కానీ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకం కింద.. ఏడాదికి రూ. 12,500 ఇస్తామని… 2017లో జరిగిన ప్లీనరీలో ప్రకటించారు. అప్పటికే కేంద్రం రైతులకు రూ. ఆరు వేలు ఇస్తుందని తెలియదు. మొత్తంగా.. తమ ప్రభుత్వమే ఇస్తుందని అప్పుడే చెప్పారు. కానీ అధికారం అందిన వెంటనే తాను ఇచ్చిన మాటకే మడమ తిప్పారు. అంటే ఒక్కో రైతుకు ఏటా ఐదు వేలు ఎగ్గొట్టినట్లే.
ఒకే సారి ఇస్తే ఎంత లాభమో కథలు చెప్పి మూడు ముక్కలు చేసి మోసం చేయడానికి సిగ్గు పడొద్దా ?
ఒక్క సారే రైతు ఖాతాలో 12500 జమ అయితే పెట్టుబడికి ఎంతగా ఉపయోగపడుతుదో జగన్ తన ప్రచార సభల్లో రాగయుక్తంగా చెప్పేవారు. కానీ అధికారంలోకి వచ్చాక అదందా బుస్సే. మూడు విడతల కిందకు మార్చేసి… రైతులే మార్చమన్నారని చెప్పేశారు. తమకు ఒకే సారి రూ. 12,500 వద్దని… మూడు విడతలుగా ఇవ్వాలని కోరారని ప్రచారం చేసుకున్నారు. ఎవరైనా డబ్బులన్నీ ఒకే సారి ఇస్తామంటే.. వద్దు.. మూడు సార్లు ఇవ్వాలని కోరేవారుంటారా..? వైఎస్ జగన్ పాలనలో మాత్రమే ఉంటారు. వారు కోరినట్లుగానే… పథకంలో మార్పులు చేశాం కానీ… తమ అభీష్టం కాదని చెప్పి.. అంతా రైతుల మీద తోసేసింది.. తెలివి ఎక్కువైపోయిన ఏపీ సర్కార్. ఇప్పుడు ఆ రైతులు కర్రు కాల్చి వాత పెట్టేందుకు రెడీగా ఉన్నారు.
ఒక్కో రైతుకు పాతికవేలు బాకీ !
రైతులకు జగన్ రెడ్డి చేసిన మోసం అంతా ఇంతా కాదు. కేవలం రైతు భరోసాలోనే ఒక్కో రైతుకు పాతిక వేల రూపాయల బాకీ ఉన్నారు. రైతుల ఇతర పథకాలన్నింటినీ ఆపేశారు. ఇంకా చెప్పాలంటే రైతులుఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఆరు నెలలకు డబ్బులిస్తారు. కానీ అది రైతు ప్రభుత్వం చేసిన సాయం కింద ప్రచారం చేసుకుంటారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏ రైతు అయినా కొనసాగనిస్తారా ?