ప్రత్యేకహోదా వస్తే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని ఊరూరా చెప్పారు. ఎంపీల్ని గెలిపించండి.. ఢిల్లీలో ఎల్లయ్య..పుల్లయ్య ఉన్న మెడలు వంచేస్తానని ప్రగల్భాలు పలికారు. ప్రజలు అన్నీ ఇచ్చారు. ప్రతిపక్షానికి కూడా వాయిస్ లేకుండా బలం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి సీఎం హోదా ఇచ్చారు. మరి ప్రత్యేకహోదా ఏమయింది ?
ఐదేళ్లలో నోటి వెంట ప్రత్యేకహోదా మాటే రాలేదే !
అపరిమితమైన రాజకీయ బలం ఉన్నా ఢిల్లీలో సాగిలన పడటం తప్ప… ఏపీకి ప్రత్యేకహోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు ?. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా ?. అడిగినంత బలం ఇస్తే.. అడిగిన సీఎం హోదా ఇస్తే చివరికి ఒక్క మాట కూడా ఏపీ హోదా గురించి మాట్లాడకపోవడం సిగ్గనిపించలేదా ?. కేంద్రానికి ప్రతీ విషయంలోనూ మద్దతుగా నిలిచారు. రాజ్యసభలో ఓటింగ్ లోనూ అడగకపోయినా రెడీగా ఉన్నామన్నారు. ఒక్క హోదా మాట ఎందుకడగలేదు ?
అలా అయితే ఎ ఎల్లయ్య.. పుల్లయ్య అయినా తెస్తారు మాస్టారు !
జగన్ రెడ్డి తన పొలిటికల్ లో అన్నీ తనకు అనుకూలంగా ఉంటేనే గెలుస్తానని చెబుతున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆయనకు వచ్చే ఎంపీల మీదనే ఆధారపడితే అప్పుడు మాత్రమే మెడలు వంచుతాడట. అలాంటి సిట్యూటేషన్ వస్తే.. జగన్ రెడ్డి ఏమిటి.. ఎల్లయ్య.. పుల్లయ్య అయినా మెడలు వంచుతారు.. కానీ జగన్మోహన్ రెడ్డి వంచలేరు. ఎందుకంటే ఆయనకు కేసుల భయం. తేడా వస్తే తెల్లారేసరికి జైలుకెళ్లి ఎంత కాలం జైల్లో ఉంటాడో తెలియనంత తీవ్రమైన కేసులు ఆయనపై ఉన్నాయి మరి.
పచ్చి మోసాలు చేసి ప్రజల్ని నమ్మించగలరా ?
ప్రత్యేకహోదాను మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఉద్యోగాల విప్లవం తెస్తామన్నారు. హోదా వస్తే ఇన్ కం ట్యాక్స్ ఉండదన్నారు. నిజంగానే ఇన్ కంట్యాక్స్ లేదు.. ఎవరికి అంటే సీఎం హోదా పొందిన జగన్ రెడ్డికి . ఆయన ఇన్ కంట్యాక్స్ కూడా ప్రజా ధనంతనే కడుతున్నారు మరి. ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేయడంలో పనితనం చూపిన జగన్ రెడ్డి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని మాత్రం కేసుల కోసం తాకట్టు పెట్టేశారు.