ఎదురుగా ఉన్న వారంతా పసిపిల్లలు. జగన్ మామయ్య అమ్మఒడి బటన్ నొక్కుతాడంటూ తెచ్చి కూర్చోబెట్టారు . కానీ సీఎం జగన్ రెడ్డికి పిల్లల ముందు ఉన్నాం.. అది పిల్లలకు సంబధించిన కార్యక్రమం అని ఎప్పట్లాగే మర్చిపోయారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై శోకాండాలు పెట్టినంతపని చేశారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించారు. పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చిన ప్రతీ సారి వైఎస్ రాజారెడ్డి వాళ్ల నాన్న పెళ్లిళ్ల దగ్గర్నుంచి జనసైనికులు సోషల్ మీడియాలో చర్చలు పెడుతున్నారు.
చివరికి షర్మిల పెళ్లిళ్ల సంగతినీ ప్రశ్నిస్తున్నారు. అయినా సరే పిల్లల ముందు మరోసారి అేద ప్రస్తావన తీసుకు వచ్చారు. నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం.. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేం అంటూ అన్నీ అనేశారు. ఇక చంద్రబాబు గురించి అంతే మాట్లాడారు. రాష్ట్రంలో తానే మంచి చేసేస్తున్నానని.. వారు అడ్డుకంటున్నారన్నట్లుగా చెప్పుకొచ్చారు. తాను మంచి చేస్తున్నానను కాబట్టి పనికి మాలిన పంచ్ డైలాగులు చెప్పననని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా మీ బిడ్డ బిడ్డ అంటూ.. వినేవాళ్లకు కూడా అసహ్యంగా కలిగేలా పదే పదే మాటలుచెప్పి.. అండగా ఉండాలని వేడుకున్నారు.
సొంత డబ్బులు పెట్టుకుని రాజకీయ సభలు ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష నేతల్ని తనకు కావాల్సిన రీతిలో విమర్శించుకోవచ్చు. కానీ బటన్లు నొక్కడానికి రూ. వందల కోట్లతో ప్రకటనలు ఇచ్చి.. అంత కంటే ఎక్కువ మొత్తం ఖర్చుపెట్టి సభలు నిర్వహించి రాజకీయ ప్రసంగాలు చేయడం .. చిన్న పిల్లల ఎదుట ఉన్నారని కూడా చూడకుండా.. విపక్షాలపై శోకండాలు పెట్టడం చూసేవారిని కూడా … కనీస ఆలోచన లేని సీఎం అన్న ఆలోచన రావడానికి కారణం అవుతోంది.