తాను చేసిన విమర్శలకు, కామెంట్స్‌కు తానే బుక్కవ్వడం జగన్‌కి కొత్తేమీకాదు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిసి బయటకు వచ్చాక…..ఓ ఇరవై ఇరవై ఐదుమంది ఎమ్మెల్యేలు మావైపు వచ్చేస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టేస్తానని యథాలాపంగా ఓ స్టేట్మెంట్ పడేశాడు జగన్. జగన్ మాటను పట్టుకుని వైకాపాను షేక్ చేసి పడేశాడు చంద్రబాబు. ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య భారీగా పెరిగిపోతున్న టైంలో అయితే వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఉంటుందా అన్న అనుమానాలు వచ్చాయి. అలాగే తెలంగాణాలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ కూడా మాదే అసలైన పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ లో కలిసిపోయినట్టుగా ఇక్కడ వైకాపాను కూడా చంద్రబాబు టిడిపిలో కలిపేసుకుంటారా అన్నంత వరకూ ఊహాగానాలు వినిపించాయి. ప్రభుత్వాన్ని పడగొడతా అన్న మాటలు అలా ఆ స్థాయిలో జగన్‌కి నష్టం చేశాయి.
చంద్రబాబు అమెరికా టూర్ వెళ్ళినప్పుడు…..పెట్టుబడుల కోసం కాదు…చల్లగా ఉంటుందని వెళ్ళాడు అని జగన్ ఓ కామెంట్ పాస్ చేశాడు. ఇఫ్పుడు అదే కామెంట్ పట్టుకుని జగన్‌పైన సెటైర్స్ వేస్తున్నారు నెటిజనులు. చల్లగా ఉంటుందన్న ఉద్ధేశ్యంతోనే చంద్రబాబు అమెరికా వెళ్ళాడన్న జగన్ విమర్శ కరెక్టే అనుకుందాం. మరి ఇఫ్పుడు జగన్ న్యూజిలాండ్ ఎందుకు వెళ్తున్నట్టు? చంద్రబాబు ప్రభుత్వ ఖర్చులతో వెళ్ళి ఉండొచ్చు. జగన్‌వి సొంత ఖర్చులే అయ్యే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ప్రతిపక్షనేత అయిన జగన్‌కి కూడా ప్రభుత్వం నుంచి కొంత ఫండింగ్ ఉంటుందనుకోండి. అయినప్పటికీ ఎండలు ఎక్కువై జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు ….ప్రతిపక్ష నేత అయిన జగన్ మాత్రం చల్లగా ఉంటుందని చెప్పి న్యూజిలాండ్ చెక్కెయ్యడం ఎంత వరకూ న్యాయం? మామూలుగా అయితే జగన్ టూర్‌పై విమర్శలు వచ్చేవి కాదేమో కానీ ‘చల్లగా ఉంటుందని చంద్రబాబు అమెరికా టూర్ వెళ్ళాడు’ అన్న జగన్ విమర్శే బూమరాంగ్ అయి ఇప్పుడు జగన్‌పైన సెటైర్స్ పడేలా చేస్తోంది.