ఆంధ్రప్రదేశ్‌లో వర్షం పడినా… పడకపోయినా.. చంద్రబాబుదే తప్పు. ఈ విషయంలో… ఎలాంటి విచారణలు..చార్జిషీట్లు కూడా అవసరం లేదు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరుక్షణం తేల్చేస్తారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వేసే ప్రతి అడుగులోనూ ఆయనకు అవినీతే కనిపిస్తోంది. చేసే ప్రతీ పనిలోనూ రాజకీయమే కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదాలకు కూడా చంద్రబాబును బాధ్యుడ్ని చేయకపోతే జగన్‌కు మనసొప్పదు. కొత్తగా ఏమైనా పథకాలు ప్రారంభించినా.. పాతపథకాలకు మేకోవర్ చేసినా… ఎన్నికల కోసమే చేస్తున్నారంటూ విమర్శలు చేస్తూంటారు.
తాజాగా.. తూ.గో జిల్లా రామచంద్రాపురంలో … జనసమూహంలో ఓ భాగాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా.. ఇలాంటి విమర్శలే దూసుకొచ్చాయి. రెండు రోజు కిందట.. రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లలో పేద కుటుంబాతో గృహప్రవేశాలు చేయించింది. ఈ విషయం ప్రజల్లోకి కాస్త పాజిటివ్‌గా వెళ్లింది. అంతే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అది అసలు విషయమే కాదన్నట్లు ప్రకటనలు చేసేశారు. ఎలాగూ ఇచ్చేశారు కాబట్టి.. ఇవ్వలేదని చెబితే.. మరీ ఎబ్బెట్టుగా ఉంటుందని.. ఎన్నికలు వస్తున్నాయనే ఇళ్లు ఇస్తున్నారని విమర్శించేశారు. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలొస్తాయి.. అది సహజమే. మళ్లీ ఎన్నికల్లో గెలవాలనే రాజకీయ పార్టీలు.. ప్రజలకు వ్యక్తిగతం లబ్ది చేకూర్చే పథకాలు ప్రకటిస్తూంటాయి.. అమలు చేస్తూంటాయి. వైఎస్ జగన్ వచ్చినా.. మళ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే… పాలన చేస్తారు. ఇళ్లిస్తారు.. పెన్షన్లిస్తారు. అందులో విశేషం ఏముంది..?
అదేదో చంద్రబాబు మామలూగా ఇవ్వడు.. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి ఇస్తున్నాడని…ఆ వ్యవహారాన్ని తేలిక చేసే ప్రయత్నమే. మరి జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు..? ఎన్నికల కోసం కాదా..? ఈ సారి గెలవకపోతే… జీవితంలో మళ్లీ చాన్స్ రాదన్న ఆభద్రతోనే కదా… రోజుల తరబడి నడుస్తోంది. అది కూడా ఎన్నికల కోసమే కదా..? ప్రధాన ప్రతిపక్ష నేతగా విమర్శలు చేసేటప్పుడు… దాన్ని ప్రజలు నమ్ముతారా లేదా.. అన్నదానిపై కాస్తంత అవగాహన ఉంచుకోవాలి. కానీ జగన్ అలాంటిదేమీ పెట్టుకోరు. తన దారిలో వెళ్లేటప్పుడు…రోడ్డుపై గుంత కనిపించినా.. దాన్ని చంద్రబాబుకు లింక్ పెట్టేయాలని తాపత్రయపడతారు. దాన్ని మార్చుకోలేకపోతున్నారు.