వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ పై, ఆయన ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పై తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు. పాదయాత్ర సందర్భంగా కందుకూరు బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే –
“నేను చంద్ర బాబు పార్ట్ నర్ పవన్ ని అడుగుతున్నా. చిత్తశుద్ది ఉంటే కేంద్రం పై అవిశ్వాసం పెట్టమని పవన్ అంటున్నాడు. వైఎసార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్దంగా ఉంది. మరి టిడిపి మద్దతిస్తుందా. పవన్ కోరినట్టే మేం అవిశ్వాస తీర్మానం పెడతాం. మొత్తం 54 మంది ఎంపీల మద్దతు దీనికి కావాలి. మేం తీర్మానం పెడితే టిడిపి ఎంపీల మద్దతు మీరు ఇప్పిస్తారా అని అడుగుతున్నా. JFC అని పవన్ పెట్టిన కమిటీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుంది. చంద్ర బాబు తాన అంటే ఈ కమిటీ తందాన అంటుంది. రాష్ట్రానికి వచ్చిన నిధులు, వాటి లెక్కల సంగతి ప్రక్కన పెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకడం మాని ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి, ప్రత్యేక హోదా కోసం పోరాడండి. ” – ఈ తరహా లో విరుచుకుపడ్డారు జగన్.
ఇదే సభలో మాట్లాడుతూ మళ్ళీ హోదా వస్తే ఇన్ కం ట్యాక్స్ కట్టాల్సిన పని లేదని వ్యఖ్యానించారు జగన్. ఇది ప్రత్యేక హోదా కి సంబంధం లేని విషయం అని ఇదివరకే తెలుగు360 లో చర్చించడం జరిగింది(https://www.telugu360.com/jagan-misunderstands-special-category-status/). అలాగే వృద్దాప్య పింఛన్లని వెయ్యి నుంచి ఏకంగా 10 వేలకి పెంచుతానని వ్యాఖ్యలు చేసారు జగన్.