వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల ఆవేదనను వారు బయటకు చెప్పుకోలేరు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయో చెప్పడం కష్టం. మూడు బాగోలేనప్పుడు కనబడితే షేపులు మార్చేస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి,
మంత్రి పదవి చేపట్టక ముందు అంబటి రాంబాబు ఎలా ఉండేవారో ఓ సారి గుర్తు చేసుకున్నా..ఇప్పుడు గుర్తుకు రారు. ఎందుకంటే ఆయన నుగ్గుబుట్ట లాంటి జుట్టుతో కనిపించడం ప్రారంభించారు. అదే అసలు రూపం. కానీ అంతకు ముందు చక్కగా హెయిర్ డై వేసుకునేవారు. నిగనిగలాడే నల్ల జుట్టు ఉండేది. అందరూ హెయిర్ డై వాడుతూంటే అంబటి ఒక్కటే ఎందుకు త్యాగం చేశాడు ?.. జగన్ రెడ్డి వద్దన్నాడు కాబట్టి. జుట్టుకు రంగేసుకుని తన ఎదుటకు రావొద్దని ఓ సారి అసహ్యించుకోవడంతో తప్పనిసరిగా అంబటి హెయిర్ డై మానేశారని వైసీపీలో అందరికీ తెలిసిన విషయం.
పిల్లిగడ్డం విజయసాయిరెడ్డిది కూడా అంతే. ఆయన చక్కగా పిల్లిగడ్డం పెట్టుకుని.. మంచి హెయిర్ డైతో కనిపించేవారు. టాప్ ఎగ్జిక్యూటివ్ లా ఉండే ఆయనను విజయసాయిరెడ్డి అందరి ముందు ఎగతాళి చేశారు. ఆ పిల్లి గడ్డం ఎందుకని పరువు తీయడంతో ఆయన తీసేశారు. జుట్టుకు కూడా రంగేసుకోవడం మానేశారు. ఇప్పుడీ అవతారంలో కనిపిస్తున్నారు.
అయినా తమ ఎదుటి వారు హెయిర్ డై వేసుకుంటే.. ఫ్రెంచ్ గడ్డం ఉంటే.. జగన్ కు ఏమి ఇబ్బంది?. దీనికి సమాధానం కావాలంటే జీవితా, రాజశేఖర్ ఓ సారి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రాజశేఖర్ బాగా రెడీ అయి వస్తూంటే.. అందరూ తనను చూడటం లేదని చిన్నబుచ్చుకున్న జగన్.. ఇక రానవసరం లేదని చెప్పారట.. జీవిత ఒక్కటి వస్తే చాలన్నారట.. అందుకని ఇద్దరూ వెళ్లడం మానేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పాపం వైసీపీ లీడర్స్.