జంగారెడ్డి గూడెంలో రెండు రోజుల్లో పద్దెనిమిది మంది ఒకే రకమైన లక్షణాలతో చనిపోవడం సహజమేనని సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. స్వయంగా అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. కల్తీ నాటు సారా కారణంగా చనిపోయారని మృతుల కుటుంబీకులు, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టడంతో సీఎం జగన్ ప్రకటన చేశారు. దేశంలో ప్రతీ రోజు రెండు శాతం సహజ మరణాలు సహజమేనన్నారు. వృద్దాప్యం, అనారోగ్యం, ప్రమాదాలు.. ఇతర కారణాల వల్ల రెండు శాతం మంది చనిపోతూంటారని.. జంగారెడ్డి గూడంలో యాభై వేలకుపైగా జనాభాఉన్నారని.. వారిలో పద్దెనిమిది మంది చనిపోవడం సహజమేనన్నారు.
నాటు సారా కారణంగా చనిపోలేదన్నారు. మృతుల కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందించలేదు కానీ.. టీడీపీ నేతలు మాత్రం శవ రాజకీయాలుచేస్తున్నారని విమర్శించారు. అంతకు ముందు జంగారెడ్డి గూడెం ఘటనపై చర్చకు పట్టుబట్టినందుకు ఐదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాల మొత్తం సస్పెండ్ చేశారు. చనిపోయిన వారిలో పదహారు మందిని కుటంబీకులు దహనం చేసేశారు. దీంతో పోస్టుమార్టంకు వీలు లేకుండా పోయింది. ఇద్దరిని మాత్రమే ఖననం చేయడంతో వారి పోస్టు మార్టం పూర్తి చేశారు. నివేదికలు రావాల్సిఉంది. అయి
ఎలాంటి విచారణలు.. అధికారుల నివేదికలు లేకుండా సీఎం జగన్ .. రోజువారీ మరణాల సగటును చూపించి.. అవన్నీ సహజమరణాలేనని తేల్చేయడం అందర్నీ విస్మయపరిచింది. మనిషి ప్రాణానికి విలువలేదన్నట్లుగా ఆయన మాట్లాడటతం.. వైసీపీసభ్యులను సైతం విస్తుపోయేలా చేసింది. మొత్తంగా జంగారెడ్డిగూడెంలో నాటు సారి ఏరులైపారుతోందని .. వైసీపీ నేతలే వ్యాపారులని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం.. పట్టించుకోవడానికి సిద్ధంగా లేదని తేలిపోయింది.