ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన స్పీచ్ చూస్తే ఎవరికైనా ఓటమితో ఆయన కళ్లు తెరవలేదని అర్థమైపోతుంది. అదే గర్వంతో ఉన్నారు. అదే అహంకారంతో ఉన్నారు. ప్రజలు తప్పు చేశారో.. ఏదో కుట్ర జరిగిందని అనుకుంటున్నారు. ఇదే మైండ్ సెట్ తో ఉంటే జగన్ రెడ్డి మళ్లీ కోలుకోవడం అసాధ్యంగా మారుతుంది.
ఇప్పటికే ఆయన కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. శ్రేయోభిలాషుల్ని దూరం చేసుకున్నారు. కేవలం తన పక్కన ఉంటే వచ్చే డబ్బులకు ఆశపడిన వారిని మాత్రమే ఉంచుకున్నారు. వారంతా ఇవాళ నుంచి కనిపించరు. తాము ఘోరంగా ఓడిపోవడానికి జగనే కారణం అని పార్టీ ముఖ్య నేతలంతా రగిలిపోతూంటారు. త్వరలో వారు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయారో అర్థం చేసుకోవడానికి ఆయనకు అహం అడ్డు రావొచ్చు కానీ నిజం మాత్రం అదే.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం . కానీ అదే అహంకారంతో ఉంటే మాత్రం ఎప్పటికీ కోలుకోలేరు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎంతో కాలం కష్టమని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ ఆయన పదవిలో ఉన్నప్పుడు సృష్టించుకున్నవే. వాటిని అధిగమించాలంటే ఎంతో మారాలి.. లేకపోతే మరోసారి పోటీ చేయడానికి వైసీపీ ఉండకపోవచ్చు.