వైసీపీలో మూల విగ్రహం జగన్ అయితే.. మొత్తం చేయించేది సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్లు చెప్పనిదే వైసీపీ నేతల నోట్లోంచి ఒక్క మాట రాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ తాము చేసిందంతా చేసి అందర్నీ ఇరికించిన తర్వాత తాము అమాయకులమని తమకేదీ తెలియదని వారు స్వయం సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి అదే పని పని చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తనను 120 నిందితుడిగా చేర్చారని .. అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే హత్యాయత్నం కేసులు పెట్టారని వాదిస్తూ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తాను అమాయకుడ్నని చెప్పుకున్నారు.
అసలు టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటన మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి ఈగో వల్ల వచ్చిందే. పట్టాభి తాను సజ్జల రామకృష్ణారెడ్డిని అన్న మాటల్ని జగన్ రెడ్డిని అన్నట్లుగా అన్వయించారు సజ్జల. జగన్ రెడ్డి పేరు చెప్పి దాడులకు పురమాయించారు. ఆయన చెప్పకపోతే ఒక్కరూ ఒక్క అడుగు ముందుకు వేయరు. ఇటు నుంచి అవినాష్.. అటు నుంచి అప్పిరెడ్డి తాము పోషించే చిల్లర ముఠాలను తీసుకుని వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆ దాడులకు పోలీసులు కూడా తమ వంతు సహకారం అందించారు. ఐదేళ్లు పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న సజ్జల దీనికి కారణం కాదా ?
అంతా చేసి తాను అమాయకుడ్ని సజ్జల చెబుతున్నారు. జగన్ రెడ్డివి అంత కంటే ఎక్కువ అతి తెలివి తేటలు. ఆయన పార్టీ కార్యకర్తల సమావేశం పెట్టి ఎవరు ఎక్కువ ప్రభుత్వంపై యుద్ధం చేస్తే వారికి ఏరి కోరి పదవులు ఇస్తానని చెబుతున్నారు. పదేళ్ల పాటు ఆయన కోసం పని చేసిన వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడో గుర్తు చేసుకోవాలని క్యాడర్ ఆయన తెలివిని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక క్యాడర్ ను నిర్వీర్యం చేసేలా వ్యవస్థల్నితెచ్చి పెట్టి ఇప్పుడు తన కోసం పోరాడాలని.. యుద్ధం చేయాలని కోరుతున్న ఆయన అతి తెలివిని చూసి…. మిగతా వాళ్లు కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. జగన్ రెడ్డి, సజ్జల ఇద్దరూ ఒకర్ని మించి ఒకరు ఒలకబోస్తున్న అమాయకత్వం వైసీపీలో హాట్ టాపిక్ అవుతోంది.