గుంటూరులో శవ రాజకీయం చేయడానికి వెళ్లిన జగన్ రెడ్డి మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ. పది లక్షలు ఇస్తానని ప్రకటించారు. కనీసం తన ధీరత్వాన్ని..వీరత్వాన్ని ప్రకటించుకుని రాజకీయం కోసం ఉపయోగపడిన ఆ కుటుంబానికి వెళ్లేటప్పుడు అయినా ఆ రూ. పది లక్షల చెక్కు ఇస్తారని అనుకుంటే ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో ఎవరికీ తెలియదు. ఆ ప్రెస్మీట్లో జగన్ రెడ్డి ఏపీలో 77 మంది అత్యాచారానికి గురయ్యారని వారందరికీ తలా రూ. పది లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ మాటతో వైసీపీ నేతలు కూడా ఉలిక్కిపడ్డారు. ఇదేదో తేడాగా ఉందే అనుకున్నారు. విజయనగరం జిల్లా డయేరియా బాధితులకూ అదే చెప్పారు. రూ. రెండు లక్షలు ఇస్తానన్నారు. కానీ చెక్కులు మాత్రం పంపిణీ చేయలేదు.
జగన్ రెడ్డి ఇలా ఆర్థిక సాయం చేస్తానని చెప్పిన ఏ సందర్భంలోనూ ఇచ్చిన దాఖలాలు లేవు. విజయవాడ వరద బాధితులకు రూ. కోటి ఇస్తామని చెప్పారు కానీ ఆయన ఇచ్చిందేమీ లేదు. వైసీపీ స్టిక్కర్లు వేసిన కొన్ని నిత్యావసరాలు పంచి రూ. కోటి కాదు.. కోటిన్నర పంచామని ప్రచారం చేసుకున్నారు. హుదూద్ అప్పుడూ అంతే. పార్టీ కోసం పని చేసి ఎవరైనా చనిపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు రాజకీయం చేయడానికి జగన్ రెడ్డి లక్షలకు లక్షలు ఇస్తానని ప్రకటిస్తూంటే అందరూ వింతగా చూస్తున్నారు
నిజానికి ఇచ్చే ఉద్దేశం ఉంటే తనతోపాటు చెక్కు తీసుకెళ్లి ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వాలనుకుంటోంది పార్టీ సొమ్ము. చెక్కులు ఇస్తే సరిపోతుంది. జీవోలేమీ అక్కర్లేదు. కానీ ఆయన ఇవ్వలేదు. బహుశా.. జగన్ రెడ్డి పది లక్షలు ఇస్తారని చెప్పి శవరాజకీయానికి సహకరించేలా వారిని ఒప్పించి ఉంటారు. ఇవ్వాల్సి వస్తుందేమోనని ఇస్తానని చెప్పారు. ఎప్పటికి ఇస్తారో ఎవరికీ తెలియదు. ఇవ్వకపోయినా వాళ్లు ఎవర్నీ అడగలేరు. జగన్ రెడ్డి రాజకీయమే అంత.