వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలో ప్రజాధనంతో లగ్జరీగా నిర్మించుకున్న తన పార్టీ ఆఫీసులో కొత్తగా నియమించుకున్న సలహా మండలితో సమావేశమయ్యారు. నిజానికి ఆ మండలిలో ఒక్కరూ సలహాలిచ్చేంత ధైర్యం చేయరు. అందరికీ జగనే సలహాలివ్వాలి. బేసిక్ ఆ సలహాలు కూడా ఆయన ఇవ్వరు. సజ్జల రాసిస్తారు. జగన్ చదువుతారు. ఇలా రాసిచ్చారో లేకపోతే కొత్తగా ట్రై చేద్దామని ప్రయత్నించారో కానీ ఈ సారి కొత్త కథ చెప్పారు. గతంలో పురాణాల నుంచి ఎవో చెప్పేవారు. ఈ సారి మాత్రం స్క్రిప్ట్ మార్చారు. హాలీవుడ్ సినిమా గ్లాడియేటర్ కథ చెప్పారు.
గ్లాడియేటర్ సినిమా కథను ప్రస్తుత అరెస్టులకు ముడిపెట్టి చెప్పాలనుకున్నారు. ఆ సినిమా కొత్తగా వచ్చి ఉంటే సరేలే అనుకోవచ్చు. ఆ సినిమా వచ్చి పాతికేళ్లయింది. ఖాళీగా ఉన్న జగన్ .. ధైర్యం కోసం గాలి కొట్టుకోవడానికి అలాంటి సినిమాలు చూడాలని ఎవరైనా ప్రిఫర్ చేశారో లేకపోతే.. ఓటీటీలు సర్ఫింగ్ చేస్తూ ఎక్కడైనాకనిపించిదో కానీ గ్లాడియేటర్ ఇప్పుడు చూసినట్లుగా ఉన్నారు. ఆ సినిమాను ఎవరైనా చూడటం స్టార్ట్ చేస్తే ఆపలేరు. జగన్ కూడా మొత్తం చూసి ఉంటారు. అందుకే గుర్తు చేసుకుని మళ్లీ ఆ కథను తన పార్టీ నేతలు చెప్పారు.
జగన్ కు సినిమాలంటే ప్రత్యేకమైన ఆసక్తి. గతంలో బాలకృష్ణకు ఫ్యానిజం చేశారని చెబుతారు. నిజం ఎంత ఉందో కానీ.. ఓ సారి ఉత్తరాంధ్ర తుపానుతో అల్లాడిపోతూంటే హాయిగా ఏఎంబీలో ఓ ఇంగ్లిష్ సినిమాకు వెళ్లారు. అందుకే జగన్ గ్లాడియేటర్ లాంటి కథలు చెబుతూంటే అందరూ బాగానే వింటారు. కానీ ఆ సినిమాను ఇంత ఆలస్యంగా జగన్ చూశారా అని కొంత మంది ఆశ్చర్యపోతున్నారు. చాలా వెనుకబడి ఉన్నారని సెటైర్లు వేసుకుంటున్నారు.