వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా మంచోడు … ఆయన కుమారుడు వైఎస్ జగన్ తో పోలిస్తే చాలా చాలా మంచోడు. ఈ మాట అంటున్నది ఆంధ్రజ్యోతి ఎండీ వేమురి రాధాకృష్ణ. వైఎస్ గురించి ఆయన ఒక్క సారి కూడా ఇలా మాట్లాడి ఉండరు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి సొంత కుటుంబసభ్యులనే ఆస్తి కోసం మోసం చేసిన వైనంలో మోసపోయిన కుటుంబసభ్యులకు అండగా ఉంటూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వారం కొత్తపలుకులో ఆయన జగన్ రెడ్డి చేసిన పనుల వల్ల ఎలా వైఎస్ ఎలా మంచోడు అవుతున్నాడో పరోక్షంగా వివరించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా వచ్చి పడే డబ్బు అయినా అప్పనంగా వస్తున్నా.. ఇతరులకు ఉదారంగా సాయం చేసేవారట. ఎవరైనా పెళ్లి కార్డు ఇచ్చి పోతే డబ్బులు పంపేవారని చెబుతున్నారు. అయితే వారంతా సామాన్యులు కాదు. సమాజాంలో ఎంతో కొంతం పేరున్నవారు. బహుశా.. అలా డబ్బులు అందుకున్న వారే ఇప్పటికీ కృతజ్ఞత చూపుతున్నారేమో కానీ జగన్ రెడ్డి మాత్రం సొంత చెల్లి ఆస్తుల్ని కూడా లాక్కునేవాడని ఆయన మాత్రం పిల్లికి బిచ్చం పెట్టరని ఆర్కే చెబుతున్నారు.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రజా ఆస్తుల్ని క్విడ్ ప్రో కో కింద అమ్మేసుకుని పోగేసుకుంటున్న సంపద విషయంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు కానీ అంతకు ముందు ఆయన పని ఈ అక్రమాసుల్ని కంపెనీలుగా మార్చడమే. ఆ సమయంలోనే వైఎస్ షర్మిలకూ సగం రావాలని స్పష్టం చేశారట. న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఇప్పుడే వద్దని విజయసాయిరెడ్డి చెప్పారని ఆర్కే అంటున్నారు. అప్పుడే ఆయన మొత్తం ఆస్తిలో సగం షర్మిలకు రావాల్సిందేనని తేల్చి చెప్పారని అంటున్నారు. ఇదే విషయాన్ని విజయలక్ష్మి చెప్పారని.. అది నిజం కాబట్టే విజయసాయిరెడ్డి , సుబ్బారెడ్డి నోరు మెదపడం లేదని చెబుతున్నారు.
రాజకీయం కోసం తల్లి, చెల్లిని కూడా బుతులు తిట్టిస్తున్న జగన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని ఆర్కే అంటున్నారు. ఇప్పటికీ జగన్ లాంటి వారిని సమర్థిస్తున్న వారిని చూసి ఆర్కే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ వర్గాన్ని సైకోలుగా మార్చేశారని… ఏం చేసినా వారంతా జగన్ రెడ్డి వెంటే ఉంటున్నారని ఆర్కే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ఎంత ఘోరమైన వ్యక్తో చెప్పడానికి ఆయన తండ్రిని మంచోడ్ని చేయడం కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ షర్మిల, విజయమ్మ, కాంగ్రెస్ ఆస్తి అనుకోవచ్చు.