వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్ని పీడించుకునే మాన్స్టర్గా అందరితో గుర్తింపు పొందారు. ఆయన అత్యంత ఘోరంగా ఓడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. గెలిచిన పదకొండు సీట్లలో కూడా ఐదారు తప్ప మిగిలినవన్నీ అతి కొద్దిమెజార్టీతో గెలిచారు. అంత ఘోరమైన ఫలితం దేశ చరిత్రలో ఎవరికీ రాలేదు. ప్రజలు అంతగా భయపడిపోయారు. ఇప్పుడు జగన్ మళ్లీ వస్తే అని భయపెడుతున్నారు. ఈ పరిస్థితిని తెచ్చుకుంటోంది జగన్మోహన్ రెడ్డి.. వైసీపీనే.
ఇంకా పది నెలలు కాలేదు అప్పుడే వైసీపీ నరుకుడు బెదిరింపులు!
వైఎస్ఆర్సీపీ అధికారం పోయి పది నెలలు అయింది. ఆ పార్టీ నేతలు అప్పుడే మేము వస్తే నరికేస్తాం..చంపేస్తాం అని బెదిరింపులు ప్రారంభించారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసుల బట్టలిప్పదీస్తా అని మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలో ఉండి చేసిన పనులకే మరోసారి అధికారం వస్తుందో రాదో అని అనుమానం కలిగేలా పాతాళంలోకి నెట్టేశారు. అయినా ఆ అరాచకానికి మద్దతు ఉంటుందని ఆయన నేతృత్వంలో రౌడీ మూకలతో రాజకీయాలు ప్రారంభించారు. కానీ అప్పుడే ప్రజలు భయపడటం ప్రారంభించారు.
వైసీపీ అధికారంలోకి రావాలి.. అనుకుంటే కూటమి నేతలు ఇప్పుడే చేయలేరా ?
వైసీపీ అందర్నీ నరుకుతాం..చంపుతాం అంటున్నారు..కానీ ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది.. వారు చేయాలనుకుంటే.. ఇప్పుడు ఆ పని చేయలేరా?. ఇప్పుడుచేయాల్సినదంతా చేసేసి..ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి రాముడు మంచి బాలుడు తరహాలో వ్యవహరాలో ఓటింగ్ సమయానికి ప్రజలు అంతా మర్చిపోతారు. కానీ కూటమి నేతలు సంయమనం పాటిస్తున్నారు. దాన్ని చాన్స్ గా తీసుకుంటే ఎవరు నష్టపోతారు?. జగన్ మళ్లీ వస్తే అనే భయం ప్రజల్లో పెరగడానికి కారణం.. వైసీపీ నేతల తీరే.
జగన్ లాంటి క్రిమినల్ను వ్యవస్థలు ఎంత కాలం సహిస్తాయి ?
జగన్మోహన్ రెడ్డి ఓ క్రిమినల్. ఆయన మైండ్ సెట్ కూడా పూర్తి స్థాయిలో సిల్లీ కుట్రలతో నిండి ఉంటుంది. ఐదు సంవత్సరాల పాలనలో ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూలించడానికి కూడా ఆయన చేయని ప్రయత్నం లేదు. అలాంటి వ్యక్తిని వ్యవస్థలు ఎంత కాలం చూసి చూడకుండా ఉంటాయన్నది ఇక్కడ ప్రశ్న. ఆర్థిక వ్యవస్థను అడ్డంగా దోచుకుని ఆ డబ్బుతో రాజకీయాలు చేస్తూ.. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ..అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టును కూడా బ్లాక్ మెయిల్ చేయడానికి వెనుకాడని ఓ క్రిమినల్ ను ఎంత కాలం సహిస్తారు ?. అలా వదిలేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ో?
జగన్ మళ్లీ వచ్చే ప్రశ్నే లేదంటున్న ఉండవల్లి
ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ లాజిక్ చెప్పారు. ఆయన లాయర్.. లాజిక్కు లేకుండా మాట్లాడరు. ఆయన చెప్పిన ప్రకారం జగన్ టీడీపీ, జనసేన కలిసి ఉన్నంత కాలం అధికారంలోకి రాలేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ, జనసేన ఓటింగ్ ఖచ్చితంగా యాభై శాతం దాటుతుంది. అలా దాటితే కనీసం 150 సీట్లు వస్తాయి. అందుకే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేదు. ఈ లోపు శిక్షలు పడితే అనర్హతకు గురవుతాడు.పోటీ కూడా చేయలేడు అని.. చెప్పారు.ఇందులో 99.99 శాతం నిజం ఉంది. అందుకే వైసీపీ నేతలు కూడా జగన్ ను నమ్ముకుని నరికేస్తాం..చంపేస్తాం అని సొల్లు ప్రకటనలు చేయకుండా..ఒళ్లు కాపాడుకుంటే మంచిదన్న సలహాలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.