జగన్ రెడ్డి కి ఎంత క్రిమినల్ బుర్ర ఉందో ఊహించడం అసాధ్యం . ఆయన చేస్తున్న పనుల్లో ఉన్న లోతుల్ని అర్థం చేసుకోవడం కూడా ఎవరికైనా కష్టం. ప్రస్తుతం ఆయన దేశంలో వ్యవస్థలన్నీ చివరికి రాజ్యాంగం సహా అన్నీ ఎంత డొల్లో నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఆలోచనలు.. అమలు చేస్తున్న విధానం చూస్తే.. నిజంగా దేశం మొత్తం ఇలా చీపురు పుల్లల్లాంటి వ్యవస్థల మీద నిలబడి ఉందా … గట్టిగా జగన్ రెడ్డి లాంటి వాళ్లు కొడితే కుప్పకూలిపోతుందా అని ఆశ్చర్య పడకతప్పదు.
కళ్ల ముందు కనిపించే స్కిల్ సెంటర్లు లేవని కేసులు – నమ్మించేస్తున్నారు !
స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజ్యాంగానికి.. చట్టాలకు.. న్యాయాలకు ఎలా కళ్లకు గంతలు కట్టారో కళ్ల ముందే ఉంది. అయినా వ్యవస్థల్ని కళ్లు తెరవనీయకుండా చేశారు. రాజ్యాంగం ప్రకారం పాలసీ మ్యాటర్స్ లో ముఖ్యమంత్రికి అధికారం ఉంది . కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు సీఐడీకి లేదు. కానీ ఈ రాజ్యాంగం … తన చేతుల్లో చెల్లుబాటు కాదని నిరూపించారు. ఎదురుగా ఉన్న స్కిల్ సెంటర్లు లేవని… కేంద్రం నుంచి వచ్చిన.. తామే ఇచ్చిన సర్టిఫికెట్లన్ని దాచేసి కేసులు పెట్టారు. డబ్బులు మళ్లించారని .. ఒక్క ఆధారం లేకుండా వాదిస్తున్నారు. పధ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేసి తనకు న్యాయం కోసం సుప్రీంకోర్టుదాకా వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు.
లేని రింగ్ రోడ్ మీద కేసులు – న్యాయస్థానాల్లో వాదనలు
ఓ వైపు కళ్ళముందే కనపడుతున్న స్కిల్ సెంటర్లు లేవని కేసులు పెడితే.. రివర్స్ లేని రోడ్డులో రింగురోడ్డు ఉందని కేసులు పెట్టేశారు. రింగ్ రోడ్ అనేదే లేదు. కేవలం ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఆ ప్రతిపాదనల వల్ల చాలా మందికి మేలు జరిగిందని కేసులు పెట్టేశారు. తన వారికి లబ్ది చేకూర్చారని ఫిర్యాదు … అదీ ఓ వైసీపీ ఎమ్మెల్యే చేస్తే సీఐడీ కేసు పెట్టింది. దానిపై సంబంధం లేని… తమ రాజకీయ కక్ష తీర్చుకోవాలనుకున్న వారందరి పేర్లూ చేర్చేస్తోంది.
వ్యవస్థలు అత్యంత బలహీనం నిరూపించడమే జగన్ రెడ్డి
ఈ కేసుల వెనుక రాజకీయ కక్ష సాధింపులు ప్రాథమిక లక్ష్యం అయి ఉండవచ్చు కానీ.. ఇలాంటి కేసులు పెట్టడం వెనుక మాత్రం ఖచ్చితంగా మన వ్యవస్థలు ఎంత బలహీనమో చెప్పేందుకు జగన్ రెడ్డి క్రిమినల్ బుర్రను వాడుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలు బలమైనవే కానీ వాటిని నడిపించేది కూడా మనుషులేనని… ఆయన నిరూపిస్తున్నారు. ఇది ఓ రకంగా దేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయాన్ని బలహీనపర్చడమే.
ఇలాంటి కేసులు ఆదర్శమయితే దేశంలో అల్లకల్లోలమే !
స్కిల్ లాంటి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగలిగితే… జగన్ రెడ్డి లాంటి వాళ్లను పదవి పోయిన తర్వాత ప్రతీ రోజూ జైల్లో ఉంచవచ్చు. జగన్ రెడ్డి అనే కాదు… ముఖ్యమంత్రిగానే కాదు.. ఎవరిపైనేనా .. సన్నిహితులు.. లబ్ది పేర్లతో కథలు చెప్పి కేసులు పెట్టేయవచ్చు. ఏ ఆధారం లేకపోయినా సరే. ఇన్నర్ లాంటి కేసులు అయితే.. గాల్లో ఊహించేసుకోవచ్చు. జగన్ రెడ్డి చట్ట విరుద్ధంగా విశాఖ రాజధాని అంటున్నారు. అక్కడ తన సన్నిహితులకు ఎంత లాభం చేశాలో కేసులు పెట్టడం చాలా ఈజీ అని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ముందు ముందు ఇలా కూడా కేసులు పెట్టవచ్చా అనేలా కేసులు పెడతారు. ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ వ్యవస్థల డొల్లతనాన్నిప్రజల ముందు ఉంచబోతున్నాయి. అదీ అసలు జగన్ రెడ్డి చేస్తున్న కుట్ర .