వాలంటీర్లు లేకపోయినా లబ్దిదారులందరికీ మధ్యాహ్నానికి పెన్షన్లు పపిణీ చేయవచ్చు. వారిని సచివాలయాలకు పిలిపించి ఎండలో చంపేందుకు కుట్ర చేయాల్సిన పని లేదు. బ్యాంకుల్లో వేసి బ్యాంకుల చుట్టూ తిప్పాల్సిన అవసరం రాలేదు. కానీ ఒకటో తేదీన వాలంటీర్లను ఉపయోగించుకోకుండానే అందరికీ పెన్షన్లు అందేశాయి. ఇదంతా ప్రభుత్వ ఉద్యోగుుల ద్వారానే జరిగింది. మరి ఎన్నికల సమయంలో.. మండుటెండల్లో ఎందుకు ప్రభుత్వం ఆా పని చేయలేదు అన్నది సులువుగా అర్థం చేసుకోవచ్చు.
వృద్ధుల శవాలతో రాజకీయం చేయాలనుకున్నది వైసీపీ. జగన్ , సజ్జల స్క్రిప్ట్ రెడీ చేశారు. ఎలాగూ వాలంటీర్లతో పంపిణీకి ఈసీ బ్రేక్ వేస్తుంది కాబట్టి.. వాలంటీర్లు లేకపోతే పించన్లు అందవన్న ప్రచారం చేయాలనుకున్నారు. దానికి కారణం చంద్రబాబే అని రెచ్చగొట్టాలనుకున్నారు. అనుకున్నట్లుగా స్క్రీన్ ప్లే రెడీ చేశారు. అయితే కొంత మంది కలెక్టర్లు మనకు ఉద్యోగుల కొరతే లేదని .. ఒకటో తేదీ ఉదయమే పెన్షన్లు పంపిణీ చేయడానికి రెడీ అని చెప్పారు. కానీ ఈసీ బ్యాంకులో అయినా వేయవచ్చని సలహా ఇచ్చిందని దాన్నే ప్రయోగించారు.
ఫలితంగా పించన్ల రాజకీయంలో పలువురు వృద్ధులు చనిపోయారు. వారి శవాలతో రాజకీయం చేసేందుకు వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. జోగి రమేష్ ఓ శవం దగ్గరకు వెళ్లి ఆ శవంతో.. చంద్రబాబు ఇంటికి ర్యాలీగా వెళ్లాలని అనుకున్నారు. ఆ మృతురాలి బంధువులు చెడామడా తిట్టి పంపించారు. ఆ తర్వాత ఓట్ల రూపంలోనూ అదే పరిస్థితి ఎదురయింది. మొత్తంగా ఎన్నికల సమయంలో పెన్షన్ వ్యవహారంలో వృద్ధుల ప్రాణాలు పోవడానికి కారణం జగన్ అని ప్రజలకు చంద్రబాబు తెలియచెప్పగలిగారు.