ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షా రెడ్డి ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ అయిన ఇన్సీడ్ క్యాంపస్‌లో సీటు దక్కించుకున్నారు. అందులో అమె చేరేందుకు పారిస్ వెళ్తున్నారు. ఆమెకు సెండాఫ్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ఆర్థిక శాస్త్రంలో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఇండియాలో చదువుల తర్వాత ఆమె ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో సీటు సంపాదించారు. అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత మరింత నిపుణత సాధించేందుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలనుకున్నారు. ఇన్సీడ్ క్యాంపస్‌లో సీటు సాధించారు. అందులో చేరాలని నిర్ణయించుకున్నారు. హర్షారెడ్డి చదువు విషయంలో జగన్మోహన్ రెడ్డి సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు.
కరోనా వైరస్ పానడమిక్ కారణంగా పారిస్‌లో ఇంత కాలం ఆంక్షలు ఉండటంతో ఇన్సీడ్లో హర్షారెడ్డి చేరిక ఆలస్యమవుతోంది. అక్కడ క్యాంపస్ కూడా ప్రారంభం కాలేదు. ఇటీవలే.. పారిస్‌లో కరోనా అదుపులోకి రావడంతో అంతర్జాతీయ ప్రయాణాలను పునరుద్ధరించారు. ఇన్సీడ్ క్యాంపస్ కూడా.. రీ ఓపెనింగ్‌కు రోడ్ మ్యాప్ ప్రకటించింది. అంతా సిద్దమవడంతో… హర్షారెడ్డి పారిస్ ప్రయాణం పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సెండాఫ్ ఇవ్వనున్నారు. ఆయన కుటుంబం మొత్తం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో చేర్పించడానికి 2017లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ స్వయంగా లండన్ వెళ్లారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించే ముందు ఓ సారి కుమార్తెను చూసి వచ్చారు. పోలింగ్ ముగిసిన తరవాత ఓ సారి లండన్ వెళ్లాలనుకున్నప్పటికీ.. ఆగిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచారు. ముఖ్యమంత్రి అయిన తరవాత రెండో కుమార్తెను అమెరికాలో చదివించడానికి అక్కడ చేర్పించడానికి ఓ సారి టూర్‌కు వెళ్లారు. ఇప్పుడు ఫ్రాన్స్‌కు కూడా వెళ్లేవారు కానీ ఇండియాకు వందేభారత్ ఫ్లయిట్స్ తప్ప.. ఇతర అంతర్జాతీయ విమానాల ను అనుమతిండం లేదు. విదేశీ ఫ్లైట్స్.. అనుమతిచ్చిన విదేశాలకు మాత్రం.. ప్రయాణికుల్ని తీసుకెళ్తున్నాయి.