అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇరవై ఎకరాలు కేటాయించిన అంశంపై ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. గతంలో దేవలోకం అనే ప్రాజెక్టు చేపట్టిన వైష్ణవి అనే సంస్థకు ఇచ్చిన కేటాయింపుల్ని రద్దు చేసి వెనక్కి తీసుకునేందుకు జగన్ షూట్ చేస్తామని బెదిరించారని విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో ఆరోపించారు. ఈ అంశం సంచలనంగా మారుతోంది.
ముంతాజ్ హోటల్ ను అలిపిరి వద్ద నిర్మించాలనిచూడటమే పెద్దపాపం అయితే.. ఆ ల్యాండ్ ను ఓ అథ్యాత్మిక టూరిజం ప్రాజెక్టు కోసం కేటాయించింది వెనక్కి తీసుకోవడం మరింత ఘోరంగా కనిపిస్తోంది. ఈ ల్యాండ్ ను ముంతాజ్ హోటల్ యాజమాన్యానికి దాదాపుగా ఉచితంగా ఇచ్చారు. వైష్ణవి అనే సంస్థను బెదిరించి మరీ ఉచితంగా ఎందుకు ఇచ్చారనన్నది ఇప్పుడు సస్పెన్స్. ప్రభుత్వ రికార్డుల్లో అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అందులో ఒక్క శాతమే లీజుగా నిర్ణయించారు. అది కూడా 90 ఏళ్లకు. ఇందులో బినామీ గా వాటాలు పొంది ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ డీల్ విషయంలో ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ముంతాజ్ హోటల్స్ ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ సబ్సిడరీ. ఒబెరాయ్ గ్రూప్ లోనే నిర్మించకుండా ముంతాజ్ అనే సబ్సిడరీని ఎందుకు పెట్టారు.. అదీ కూడా తిరుమల చెంత నిర్మాణం చేయాలని ఎందుకు అనుకున్నారు.. ఈ వివరాలన్నీ వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు బయట పెట్టాయి.