టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరకూడదని జగన్ రెడ్డి గట్టిగా పట్టుదలగా ఉన్నారు. అలాగని తాను ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా చేయరు. ఒంటరిగా పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఇలా చేస్తే ఓ రాజ్యసభ సీటు ఇస్తానని ఆఫర్ బీజేపీకి ఇచ్చారు. ఈ అంశంపై మాట్లాడేందుకు అమిత్ షాతో భేటీకి జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు. అపాయింట్మెంట్ ఫిక్స్ అవగానే వెళ్తారు. అయితే జగన్ రెడ్డి ప్రయత్నాలు టీడీపీ, జనసేన పార్టీలకు రిలీఫ్ ఇచ్చేలా ఉన్నాయి.
బీజేపీతో కలిసి పోటీ చేయడం ఆ రెండు పార్టీలకు ఇష్టం లేదు. కానీ సామరస్యంగా ఉండాలనుకుంటున్నాయి. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం పొత్తుల విషయంలో ఒత్తిడి తెస్తున్నట్లుగా చెబుతున్నారు. కొంత మంది ఏపీ బీజేపీ నేతలు పొత్తుల కోసం పట్టుదలగా ఉన్నారు. మరికొంత మంది వద్దని అంటున్నారు. వీరి మధ్య కూడా ఏకాభిప్రాయం లేకపోవడంతో బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. జగన్ రెడ్డిని బీజేపీ పెద్దలు నమ్మలేరు. అవసరానికే మద్దతిస్తారని వారికి తెలుసు. రేపు తేడా వస్తే రాహుల్ ను ప్రధానిని చేయడం తమ జీవిత లక్ష్యమని చెప్పి ప్లేట్ ఫిరాయిస్తారు. ఆ విషయం బీజేపీ పెద్దలకు క్లారిటీ ఉంది.
ఇప్పుడు రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు అమిత్ షా.. జగన్ రెడ్డికి సమయం కేటాయిస్తే.. వైసీపీ విషయంలో బీజేపీ పాజిటివ్ గా నే ఉందనుకోవాలి. రాజ్యసభ సీటును తీసుకుంటే… ఇక చెప్పాల్సిన పని లేదు. హ్యాపీగా టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల్ని ప్రకటించుకుని జనంలోకి వెళ్లిపోతాయి. మొత్తంగా టీడీపీ, జనసేన కూటమి సమస్యలను .. జగన్ రెడ్డి పరిష్కరిస్తున్నారని అనుకోవచ్చు.