తండ్రి అధికారంలో ఉండగా సంపాదించిన అక్రమాస్తుల్లో చెల్లికి వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తున్న జగన్ రెడ్డి చివరికి కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. ఇప్పుడు పవర్ పోయింది. ఫ్యూజులూ ఎగిరిపోయాయి. మళ్లీ చాన్స్ వస్తుందో లేదో తెలియని పరిస్థిత ఏర్పడింది. ఇప్పుడైనా ఇంటిని చక్కదిద్దుకోకపోతే కష్టమనుకుని త్యాగాలు చేసేందుకు రెడీ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నది అక్కడ తన సోదరి షర్మిలతో ఆస్తులపై పంపకంపై మధ్యవర్తులతో చర్చలు జరపడానికేనని ఆంధ్రజ్యోతి తాజాగా ప్రకటించింది.
షర్మిల , జగన్ మధ్య వివాదాలను పక్కగా రిపోర్టు చేస్తోంది ఆంధ్రజ్యోతి, షర్మిల తెలంగాణలో పార్టీ విషయాన్ని కూడా ముందే ప్రకటించింది. దీంతో తాజా డెవలప్మెంట్ విషయంలోనూ స్పష్టమైన సమాచారం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. షర్మిల ఆస్తుల వివాదంపై బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడలేదు కానీ.. సాక్షిలో తనకూ వాటా ఉందని చాలా సార్లు చెప్పారు. ఆస్తిలో తనకూ సగం ఉందని షర్మిల చెబుతూంటారని.. ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
గతంలో ఆస్తి విషయంలో తమకు అన్యాయం జరిగిందని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తోడబుట్టిన వాళ్లు ఆస్తులు పంచి ఇవ్వకుండా… కొంచెం ఇచ్చి.. దాన్ని కూడా అప్పుగా రాయించుకుంటారని మండిపడ్డారు. ఆ వ్యవహారాలన్నీ తర్వాత ఇప్పుడు జగన్ ఆస్తులు రాసిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చర్చలు కొలిక్కి వచ్చాయని త్వరలో ఒప్పందాలు ఉంటాయని అంటున్నారు. ఒక వేళ షర్మిలతో ఒప్పందానికి రాలేకపోతే .. కాంగ్రెస్ కు కూడా దగ్గరయ్యే అవకాశం ఉండదన్న భయంతోనే ఆయన దిగి వస్తున్నట్లుగా భావిస్తున్నారు.