చంద్రబాబును ఆయన కుటుంబాన్ని ఎంత తిడితే జగన్ రెడ్డి అంతగా వీరతాళ్లు వేస్తారని..తన హోదాను కూడా .. రాజ్యాంగబద్దమైన పదవిని కూడా చులకన చేస్తూ…. విచ్చలవిడిగా నోటి విరోచనాలు చేసుకున్న తమ్మినేని సీతారాం టిక్కెట్ ను జగన్ రెడ్డి చించేశారు. ఆముదాల వలస నియోజకవర్గానికి మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు కుటుంబం నుంచి బొడ్డేపల్లి పద్మజ అనే మహిళను ఖరారు చేశారు. ఈ విషయం పై క్లారిటీ రావడంతో తమ్మినేని సీతారం ఆస్పత్రి పాలయ్యారు.
నిజానికి తమ్మినేని సీతారాం ఈ సారి తాను పోటీ చేయనని తన కుమారుడికి చాన్సివ్వాలని అడుగుతూ వస్తున్నారు. చూద్దాం అంటూ… చెబుతూ వస్తున్నారు సజ్జల. తమ్మినేని తన సీరియారిటీని గుర్తించి ఓ సారి మంత్రిని చేస్తే ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానని అనుకుంటూ వస్తున్నారు. రెండో సారి మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. అసెంబ్లీలో ఆయన చేసిన సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఓ సారి అచ్చెన్నాయుడుతో .. తాను మంత్రిని అయి కిందకు వచ్చి మీ సంగతి తేలుస్తానని సవాల్ కూడా చేశారు. కానీ జగన్ రెడ్డి పట్టించుకోలేదు.
ఇప్పుడు ఆయనకు.. ఆయన కుటుంబానికి కూడా టిక్కెట్ నిరాకరించి.. కొత్త వారసుల్ని తెరపైకి తెచ్చారు. దీంతో తమ్మినేని కుటుంబం రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనని చెబుతున్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటు గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేసినా జగన్ రెడ్డి నైజం తెలుసు కాబట్టి దానిపైనా ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ ఇస్తామని.. తర్వాత మంత్రిని చేస్తామని గతంలో ఆర్కే.. మర్రి రాజశేఖర్ వంటి వారికి ఇచ్చినట్లుగా హామీలు ఇవ్వొచ్చు కానీ.. అసెంబ్లీ టిక్కెట్టే ఇవ్వని జగన్.. మంత్రి పదవి ఇస్తారని నమ్మితే అంత కన్నా బకరా ఉండరన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.