జగన్ రెడ్డి పరిపాలకు ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ ఐదేళ్లలో ఒక్క సారి వెనక్కి చూసుకుంటే ఆయనకు ఓటేసిన వారు తమ కాలి చెప్పుతో తాము కొట్టుకుంటారు చివరికి జగన్ రెడ్డి కూడా తాను ఏం చేశానో.. దాని వల్ల తనకు వచ్చిన నష్టాలేంటో తనకు తాను బేరీజు వేసుకున్నా అదే పని చేసుకుంటారు. ఎందుకంటే జగన్ రెడ్డి వల్ల రాష్ట్రం మాత్రమే నాశనం కాలేదు. ఆయన కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఏపీకి కాళాకాంతులు లేకుండా చేసిన జగన్ రెడ్డి
సాధారణంగా సంక్రాంతి పండుగ వస్తే పల్లెల్లో పండుగ వాతావరణ ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఇటీవల ఇతర ప్రాంతాల నుంచి ఊళ్లకు వెళ్లిన వారు తమ గ్రామాల్లో పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఏ ఇంట్లోనూ గతంలో మాదిరిగా సంక్రాంతి కళ కనిపించలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే. అనేక తుపానులలతో సర్వం పంట కోల్పోయిన వారికి పైసా సాయం అందించలేదు. రైతు బంధు పేరుతో ఇచ్చే ఆరు వేల రూపాయలతో రైతుల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయానని ఆరు వందల కోట్లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఒక్క పథకం లేదు.. బోర్లు లేవు.. డ్రిప్ ఇరిగేషన్ లేదు.. . సున్నా వడ్డీ లేదు. అసలు ఏ పథకమూ లేదు. రైతులు చితికిపోయారు. ఇక పట్టణాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందా అంటే.. మధ్యతరగతి ప్రజలు కూడా వచ్చే ఆదాయంతో సరిపోనంతగా ఖర్చుల్ని పెంచేసింది ప్రభుత్వం. అసలు ఉపాధి అవకాశాలు తగ్గిపోయి నానా తంటాలు పడుతున్నారు. వ్యాపారాలు కూడా అంతంతమాత్రం.
తానేమైనా బాగుపడ్డాడా జగన్ రెడ్డి
అందర్నీ పేదవాళ్లను చేసి వాళ్లకు రేషన్ బియ్యం పడేసి ఓటు బ్యాంకులుగా మార్చుకునే వ్యూహం అయనది కాబట్టి.. ఆయన లక్ష్యం దిశగా సాగుతున్నడాని.. ఆయన కోణంలో ఇది సక్సెస్సేనని ఆయన అనుచరులు అనుకోవచ్చు. కానీ ఆయన మాత్రం బాగుపడ్డాడని ఎవరూ అనుకోరు. ఎందుకంటే జగన్ రెడ్డి వైపు చూస్తే… తన నెత్తి తాను చేయి పెట్టుకున్న భస్సాసురుడే ఎవరికైనా గుర్తుకు వస్తాడు. గత ఎన్నికల్లో జగన్ రెడ్డి కోసం ఊరూవాడ తిరిగిన తల్లీ, చెల్లి ఇప్పుడు కడిగిపారేస్తున్నారు. నిన్నటికి నిన్న జగన్ రెడ్డిని ఆయన చెల్లి షర్మిలా రెడ్డి అన్న మాటలు చూస్తే జగన్ రెడ్డి కోల్పోవడానికి కొత్తగా ఇంకేమీ లేదని చెప్పుకోవచ్చు. ఆయన సర్వం కోల్పోయాడు. అధికార అహంకారంతో ….తాను ఎవర్నో నాశనం చేస్తున్నానని అనుకున్నారు..కానీ ఆయనే నాశనానికి చివరి మెట్టులో ఉన్నారు.
అన్నీ కోల్పోయారు.. అధికారం కోల్పోవడమే మిగిలింది !
జగన్ రెడ్డికి అధికారం రాకపోతే బాగుండేదేమో అని ాయన సన్నిహితులు కూడా అనుకునే పరిస్థితి. అధికారం రాగానే కళ్లు నెత్తికెక్కి… ఆయన చేసిన పనులతో ఎవరూ ఆయనకు సన్నిహితంగా లేరు. అందరూ దూరమయ్యారు. చివరికి పార్టీ క్యాడర్ కూడా దూరమయింది. పదవులు ఉన్నాయని.. దందాలు చేసుకోవచ్చనుకునేవారు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. ఓటర్లు, అభిమానులు కూడా దూరమయ్యారు. అధికారంపోగానే వారంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అప్పుడు జనగ్ రెడ్డికి తెలిసి వస్తుంది. ఇప్పుడు ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే అధికార అహంకారం అనేది పూర్తిగా ఆయనను కమ్మేసింది.