రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. కానీ ఐదేళ్ల జగన్ రెడ్డి పాలన వల్ల ఇంకా తీవ్రంగా నష్టోయింది. కోలుకోలేనంతగా దెబ్బపడింది. అభివృద్ధి ఆగిపోయింది. వ్యవస్థలు కుప్పకూలాయి. అప్పులు పెరిగిపోయాయి. అంతా సొంత సామ్రాజ్యంగా నడిపించుకుంటూ పోయారు కానీ ప్రజలకు కనీస వివరాలు తెలియనివ్వలేదు. ఇప్పుడీ విషయాలన్నీ వెలుగులోకి రానున్నాయి. ప్రభుత్వం మారడంతో వైసీపీ సర్కార్ చేసిన విధ్వంసం మొత్తం బయటకు రానుంది.
రాష్ట్రాన్ని ఎంతకు తాకట్టుపెట్టారు ?
జగన్ రెడ్డి పరిపాలన చేపట్టినప్పటి నుండి ఏం తాకట్టు పెడదాం… ఎలా అప్పులు తెద్దాం అన్న ఒక్క మిషన్ మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. పరిపాలనా రాజధాని అంటూ హడావుడి చేసి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చింది. చివరికి ఎన్నికలకు ముందు ఏపీ సచివాలయాలను కూడా తాకట్టు పెట్టేశారన్న ప్రచారం జరిగింది. అసలు ఏమేమి ఆస్తులు ఉన్నాయో..ఎంతకు .. ఎవరికి తాకట్టుపెట్టారో పూర్తి వివరాలను అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు పెట్టనున్నారు.
అప్పుల లెక్కలపై స్పష్టత
ప్రభుత్వం ఎవరి దగ్గర ఎంతెంత అప్పులు చేసిందో స్పష్టత లేదు. చిత్ర విచిత్రమైన మార్గాల్లో అప్పులు చేశారు. పది శాతానికిపైగా వడ్డీతో అప్పులు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి లెక్కలు ఎప్పుడూ బ యటకురాలేదు. అంతా గోప్యంగా సాగిపోయాయి. పదమూడు లక్షలకోట్ల అప్పులు అనే అంచనా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే పాతిక వేల కోట్ల అప్పులు చేశారు. ఇవి తెలిసే. తెలియనివి ఉన్నాయి . ఇప్పుడీ లెక్కలన్నీ దాచే అవకాశం లేదు. బయట పడాల్సిందే., ఈ అప్పులను వపర్ పాయింట్ రూపంలో ప్రజల ముందు పెట్టనున్నారు.
వ్యవస్థల విధ్వంసంపై శ్వేతపత్రాలు
జగన్ రెడ్డి హయాంలో పాలన జరిగింది అని అనడం కన్నా.. ముఠా పాలన జరిగింది అనడం కరెక్ట్. కొద్ది మంది సివిల్ సర్వీస్ అధికారులు.. మిగతా అంతా సలహాదారులు, డిప్యూటేషన్ మీద వచ్చిన వారితో ముఠాలాగా మారి పాలన చేశారు. ఎంత విధ్వంసం చేశారో మొత్తం ఇప్పుడు బయటకు వస్తుంది. కొద్ది రోజులుగా.. అన్ని శాఖలకు సంబంధించిన పారదర్శలక వివరాల కోసం ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్నీ శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు పెట్టే అవకాశం ఉంది.