పవన్ కల్యాణ్ గ్రీన్ కో ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. అది పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్. నిర్మాణం అద్భుతం అని పవన్ ప్రశంసించారు. వెంటనే అంబటి రాంబాబు రంగంలోకి దిగిపోయారు. జగన్ హయాంలో పెట్టుబడులు ఏమీ రాలేదని అంటున్నారని..కానీ పవన్ కల్యాణ్ ఓ పెద్ద ప్రాజెక్టును సందర్శించి జగన్ తీసుకు వచ్చిన ప్రాజెక్టును ప్రపంచానికి పరిచయం చేశారన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే గ్రీన్ కో ప్రాజెక్టు 2014లో ప్రతిపాదనల్లోకి వచ్చింది. మొదటి దశ 2018లోనే పూర్తయింది. అప్పుడే రెండో దశ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జరుగుతోంది ఆ పనులే.
అయితే ఇక్కడ జగన్ కు కూడా కొంత క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే గ్రీన్ కో యాజమాన్యంతో ఏమైనా లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారో.. కమిషన్లు తీసుకున్నారో కానీ ఆ కంపెనీ జోలికి వెళ్లలేదు. లేనిపోని ఫైన్లు వేసి.. వివాదాలు రేపి వెళ్లగొట్టలేదు. దాని పని దాన్ని చేసుకోనిచ్చారు. ఈ క్రెడిట్ మాత్రం జగన్ కు ఇవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జగన్ రెడ్డి తన హయాంలో తీసుకువచ్చిన పరిశ్రమలు అంటూ ఏమీ లేవు.. కానీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తో పాటు పేరు కూడా గుర్తుండని కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. చివరికి తన సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు ఫ్రాన్స్ కంపెనీ వికాస్ కూడా ఒప్పందం చేసుకుంది. కానీ అడుగు కూడా ముందుకు వేయలేదు.
జగన్ రెడ్డి హయాంలో పరిశ్రమల రంగానికి, పారిశ్రామిక వేత్తలకు ఓ పీడకల. పెట్టుబడులు రాకపోగా ఉన్న పెట్టుబడులు తరలిపోయాయి. అనంతపురం జిల్లాలో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించి మరీ .. కమిషన్ల దెబ్బకు భయపడి జాకీ అనే పరిశ్రమ పారిపోయింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నా.. మేము ప్రాజెక్టులు తెచ్చామంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.