ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రజలు… అదీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బాధితులైన వారు.. వారికి న్యాయం చేయడానికి పాలకులకి చేతులు రావడం లేదు. ఇదిగో అదిగో అంటూ వారిని గుడారాల్లోనే ఉండేలా చేస్తున్నారు. నెల రోజుల్లో ఇళ్లిస్తామని హామీ ఇచ్చి ఏడాదిన్నర గడిచిపోయింది. ఎప్పటికప్పుడు మీడియా విషయాలను వెలుగులోకి తెస్తున్నా ప్రభుత్వం ఇదిగో అదిగో అంటోంది కానీ కట్టించిన పాపాన పాలేదు..
తాజాగా ఆ ఘటన జరిగి ఏడాదిన్నర అయిన సందర్భంగా పవన్ కల్యాణ్ మరోసారి ఇష్యూని హైలెట్ చేశారు. దీంతో అధికారులు హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లారు. నెల రోజుల్లో ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అక్కడి ప్రజలంతా స్వచ్చంద సంస్థలిచ్చిన గుడాల్లోనే బతుకుతున్నారు. ఇళ్లు కట్టివ్వలేదు. వారి పొలాల్లో మేట వేసిన ఇసుకను తీసేయలేదు. వారికి
ఉపాధి చూపించలేదు. ఎటు వైపు చూసినా ప్రభుత్వ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ప్రజల్ని గాలికి వదిలేసిన అంశం స్పష్టం గా కనిపిస్తోంది.
అసలు ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రజలకు వచ్చిన కష్టాన్ని .. అదీ కూడా దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికే అండగా నిలుస్తున్న జిల్లా ప్రజలకు వచ్చిన కష్టాన్ని ఎవరూ అడగకుండానే ఊహించనంత పరిహారం ఇచ్చి అందరికీ మేలు చేస్తారనుకుంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం గాలి తీసేశారు. బయట వాళ్లయినా సొంత జిల్లా వాళ్లయినా తన పాలనలో పెద్ద గా ఎవరూ ఆశలు పెట్టుకోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అసలు పరామర్శకు వెళ్లడానికి.. తాను వెళ్తే సహాయ కార్యక్రమాలు ఆగిపోతాయనే విచిత్రమైన లాజిక్ చెప్పి తప్పించుకున్నారు.
అన్నమయ్య బాధితులకు అధికారులు నెల రోజులు గడువు ఇచ్చారు. పవన్ కల్యాణ్ కూడా నెల రోజులు చూస్తామని..స్పష్టం చేశారు. తర్వాత బాధితులకు న్యాయం చేసేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లూ చేయలేనిది.. నెల రోజుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి.