వైసీపీ నేతలు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నారు. మాజీ మంత్రుల నుంచి కింది స్థాయి వరకూ అంతే . చాలా కొద్ది మంది వైసీపీ నేతలు మాత్రమే… దిలాసాగా ఉన్నారు. వారు ఎవరు అంటే జగన్ మెప్పు కోసం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకుండా.. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయకుండా.. సంప్రదాయంగా రాజకీయం చేసుకుని సర్వైవ్ అయిపోయిన వారు. వారికి గతంలో గొప్ప పదవులు రాకపోయినా హాయిగానే ఉన్నారు.
కానీ జగన్ మెప్పు కోసం అందరిపై దాడులు, దౌర్జన్యాలు, బూతులతో విరుచుకుపడిన వారు మాత్రం టెన్షన్ పడుతున్నారు. జగన్ కు ఎలా ఉంటే ఇష్టమో అలా ఉండేందుకు వారెవరూ సంకోచించలేదు. టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. వారి ఇంట్లో ఆడవాళ్లపై బూతు పోస్టులు పెట్టారు. కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. ఇంత చేసి జగన్ ను ఆనందపరిచింనందుకు వారికి కొన్ని పదవులు వచ్చాయి. జోగి రమేష్ ఉదంతమే తీసుకుంటే ఆయన చంద్రబాబు ఇంటిపైకి వెళ్లారు. టీడీపీ ఆఫీసుపై దాడికి పురికొల్పారు. అసెంబ్లీలోనే రఘురామ వంటి వారిని అత్యంత ఘోరంగా తిట్టారు. తన అధినేత మొహంలో చిరునవ్వు వచ్చేలా చేసుకుని మంత్రి పదవి తెచ్చుకున్నారు. మరి ఇప్పుడేయిమంది ?
ఒక్క జోగి రమేష్ మాత్రమే కాదు.. గతంలో అడ్డగోలుగా చెలరేగిపోయిన ఎంతో మంది తన స్వతహాగా ఆ పనులు చేయలేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతో.. తమ కు పదవులు వస్తాయన్న దుర్బుద్దితో దేనికైనా తెగబడవచ్చన్నట్లుగా చేశారు. చివరికి వారికి ఇప్పుడు ఆ పదవులు లేవు. అంతకు మించి తాము అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వారిని కాపాడే పరిస్థితుల్లో లేరు. కనీసం న్యాయ సాయం కూడా అందించలేరు. మహా అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డితో వాదనలు వినిపించుకోవాలని సలహా ఇస్తారు.
రాజకీయ అధినేత తన వారిని కాపాడుకునేదుకు ప్రయత్నిస్తారు. కానీ జగన్ రెడ్డి మాత్రం.. తన పార్టీ నేతలతో రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేయించి తాను సేఫ్ గా ఉన్నారు. ఇప్పుడు తన కోసం అరాచకాలకు పాల్పడిన వారంతా బిక్కుబిక్కుమంటూంటే… వారిని అరెస్టు చేస్తే రాజకీయం చేయవచ్చని చూస్తున్నారు కానీ.. వారికి అండగా ఉండే ప్రయత్ం చేయడం లేదు. చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఊరకనే అంటారా ?