నెల్లూరు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విజయసాయిరెడ్డి తోకను జగన్ కట్ చేశారు. ఆయన ప్రాధాన్యతను తగ్గించారు. వైవీ సుబ్బారెడ్డిని ఎంపీలందరికీ హెడ్‌గా చేశారు. గతంలో విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉంటూనే రాజ్యసభ పక్ష నేతగా ఉండేవారు. మిధన్ రెడ్డి లోక్ సభ పక్ష నేతగా ఉండేవారు. ఈ సారి విజయసాయిరెడ్డి ప్రాధాన్యాన్ని తగ్గించి వైవీ సుబ్బారెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేత పదవి ఇచ్చారు.
నిజానికి విజయసాయిరెడ్డినే ఢిల్లీలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. వైసీపీ తరపున అవసరమైన లాబీయింగ్‌లను ఆయన ఢిల్లీలో చేస్తూంటారు. 2014-19 మధ్య టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పటికీ … వైసీపీ.. బీజేపీకి దగ్గరగా ఉండేలా చేయడంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. ఆ ఎన్నికల్లోనూ ఆయన ఎంతో కష్టపడ్డారు. ఎవరు జగన్ రెడ్డికి ఉపయోగపడతారనుకుంటే వారి వద్దకు వెళ్లి కాళ్లకు దండం పెట్టేసి వచ్చేవారు విజయసాయిరెడ్డి.
కానీ తర్వాత ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. సజ్జల ముందుకు వచ్చారు. విశాఖ, ఢిల్లీ నుంచి కూడా విజయసాయిని దూరం పెట్టారు.
ఏ మాత్రం ఢిల్లీ పెద్దలతో పరిచయాలు లేని… వైవీ సుబ్బారెడ్డిని పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించారు. రెండు రోజుల కిందట కూడా విజయసాయిరెడ్డి నేతృత్వంలోనే ఎంపీలు ప్రెస్ మీటి పెట్టి దాడులపై మాట్లాడారు. ఇప్పుడు ఆయన తోకను జగన్ కట్ చేసేశారు.