పెద్దలను గౌరవించాలి అని మొదట పిల్లలకు నేర్పే మాట. పెద్దలను గౌరవించని పిల్లలను అందరూ తేడాగా చూస్తారు. క్రమశిక్షణ లేని వ్యక్తిగా పరిగణిస్తారు. అందుకే డౌట్ లేదు. పెద్దలను గౌరవించలేని వ్యక్తి నైతికంగా ఎప్పుడూ ఉన్నతుడు కాదు. కానీ అదే రాష్ట్ర పాలకుడు ఆ మానసిక స్థితిలో ఉంటే ఎవరేం చేయగలరు. ఆయనను ఎన్నుకున్న… ఓట్లేసిన ప్రజలు సిగ్గుపడటం తప్ప. ప్రస్తుతం ఏపీలో అదే జరుగుతోంది.
పెద్దలను గౌరవించలేని సీఎం మానసిక స్థితి ఎలా ఉన్నట్లు ?
డెభ్బై ఏళ్లు దాటిన టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబును ముసలాయన అంటూ జగన్మోహన్ రెడ్డి సంబోధిస్తున్నారు. ఒక సారి కాదు పదే పదే బహిరంగసభల్లో చంద్రబాబు పేరు ప్రస్తావన తీసుకు రాకుండా ముసలాయన అంటున్నారు. చివరికి విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చే మీట నొక్కే సమయంలోనూ ముసలాయన అనే సంబోధించారు. ఆయన తీరు నుంచి విద్యార్థులు ఏం నేర్చుకుంటారో చెప్పాల్సిన పని లేదు. ఆయన తీరుపై పెద్దల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మధ్యవయస్కుడైన సీఎం ముసలోడు కారా ?
జగన్ ఎప్పుడూ వయసులోనే ఉంటారా అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. యాభై ఏళ్లు దాటిన సీఎం మధ్యవయస్కుడి కేటగిరిలోకి వచ్చారు. అందరితో పాటు ఆయన వయసూ పెరుగుతుంది. మరో పదేళ్లు వస్తే సీనియర్ సిటీజన్ కేటగిరిలోకి వస్తారు. అంటే వృద్ధుడి కిందే లెక్క. దాన్ని ఆయన ఆపలేరు. తాను వృద్ధుడిని కాదని జీవోలు జారీ చేసుకున్నా… ఆయన వయసు ఆగదు.. వయసు పెరగడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన మానసిక అశాంతితో తన ప్రత్యర్థిని మానసికంగా వేధించాలని అనుకుంటున్నారు. అందు కోసం తాను అత్యంత మానసిక దుర్బలత్వంతో బాధపడుతున్నట్లుగా అందికీ తెలిసేలా చేసుకుంటున్నారు.
కొంత మంది పుట్టుకతోనే వృద్ధులు.. ఆ కేటగరిలోకి జగన్ రారా ?
కొంత మంది యువకులు పుట్టుకలతోనే వృద్ధులని శ్రీశ్రీ అంటారు. దాన్ని గుర్తుచేసి న టీడీపీ నేత వర్ల రామయ్య.. తిరుపతి మెట్లు ఎవరు వేగంగా ఎక్కుతారో తేల్చుకుందామా అని సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పని తీరు యువకుడు అన్నట్లుగా ఏమీ ఉండదు. ఆయన చీకటి పడిన తర్వాత పని చేస్తూ కనిపించిన సందర్బాలే లేవు. నాలుగేళ్లు దాటిపోయినా ఆయన ఫలానా పని కోసం కష్టపడ్డారన్న ప్రశ్నే లేదు. ఇంకా చెప్పాలంటే ప్రకృతి విపత్తులు వచ్చినా ఆయన బయటకు రారు. అయినా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడే చంద్రబాబును ముసలాయన అంటున్నారు. ఇదే ప్రజల్ని జగన్ మానసిక ఆరోగ్యంపై చర్చించుకునేలా చేస్తోంది.