ఏపీలో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆరోపిస్తూ, ఈ నెల 24న ఢిల్లీలో తలపెట్టిన ధర్నాను ఎలాగైనా విజయవంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు జగన్. జాతీయ స్థాయిలో చేస్తున్న ఈ కార్యక్రమానికి మద్దతు సంపాదించుకోవడంలో మాత్రం ఆయన విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ధర్నాకు మద్దతివ్వాలని కేవలం కమ్యూనిస్ట్ పార్టీలను మాత్రమే కోరారు జగన్. దీంతో, తమను మాత్రమే మద్దతు అడిగారంటే ఇదేదో రాజకీయం అనుకున్నారేమో కానీ కమ్యూనిస్టు పార్టీలు జగన్ రిక్వెస్ట్ పట్ల ఎలాంటి రియాక్షన్ వ్యక్తం చేయలేదు.
కమ్యూనిస్టులు సైలెంట్ గా ఉన్నారంటే జగన్ ధర్నాకు మద్దతు ఇవ్వడం లేదని అర్థం. అయితే, ఏపీలో విపక్ష పార్టీలుగా వైసీపీ, కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ఉన్నాయి. కానీ, అందులో జగన్ కాంగ్రెస్ ను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కమ్యూనిస్టులను మద్దతు కోరడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read : పోలీసులను బెదిరించిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ !
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిలతో విబేధాల కారణంగానే కాంగ్రెస్ మద్దతు జగన్ కోరలేదా..? ఇంకా మరేదైనా కారణమా..? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఖచ్చితంగా జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప విశాల ప్రయోజనాల కోసం ఈ ధర్నా చేపట్టడం లేదన్న విమర్శలు వస్తాయి. నిజంగానే ఏపీలో శాంతి భద్రతలు గాడి తప్పాయని భావిస్తే సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు జగన్ అన్ని పార్టీలను మద్దతు కోరాలి. కానీ ఆ పని చేయడం లేదు.
ఇప్పటికే వైసీపీ ధర్నాపై వస్తోన్న విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారని. ఇలాంటి సమయంలో తన అహంభావం పక్కనపెట్టి కాంగ్రెస్ ను కూడా మద్దతు కోరి ఉంటే ఈ ధర్నాపై వస్తోన్న విమర్శలు కొంత కొట్టుకుపోయేవి. కానీ జగన్ ఆ విధంగా చేయడం లేదు. దీంతో చిత్తశుద్ది లేని శివపూజలేల జగన్ ను ఎత్తిపొడుస్తున్నారు.