చిత్తూరు జిల్లాలో అందరూ ఓడిపోయారు. మీరిద్దరే గెలిచారు. ఆ కిటుకేటో మాకు కూడా చెప్పొచ్చు కదన్నా .. అని చిత్తూరుజిల్లా నేతల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్దిరెడ్డి గుండెల్లో మంట పెట్టాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. చిత్తూరు జిల్లాలో వైసీపీ రెండు చోట్ల గెలిచింది. పుంగనూరు, తంబళ్లపల్లెల్లో పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు గెలిచారు. ఇది జగన్ లో అనుమాన బీజం వేసింది. పెద్దిరెడ్డి కోవర్టుగా మారి తాము గెలిచి అందర్నీ ఓడగొట్టారని అనుమానిస్తున్నారని.. ఆయన వ్యాఖ్యలతో తేలిపోయింది.
పెద్దిరెడ్డి వైసీపీలో నెంబర్ టుగా చెలామణి అయ్యారు. చంద్రబాబు కుప్పం, బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి అయినా ఓడిస్తానని జగన్ కు హామీ ఆ మేరకు ఆపరేషన్లు చేశారు. కానీ అక్కడ వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీ మెజారిటీ పెరిగింది. అంతే కాదు అనంతపురంలో తుడిచి పెట్టుకుపోగా… చిత్తూరులో పెద్దిరెడ్డి, ఆయన సోదరుడే గెలిచారు. ఫలితాలను బేరీజు వేసుకుంటున్న జగన్ పెద్దిరెడ్డిని నమ్మకూడదన్న నిర్ణయానికి వచ్చారంటున్నారు.
అందుకే రోజాను వదిలేయాలనుకున్నా.. ఆమె డిమాండ్లను తీర్చి.. పెద్దిరెడ్డి అనుచరుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరీ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. పార్టీ నేతల సమావేశంలో కూడా పెద్దరెడ్డి జగన్ కు దూరంగానే సీటు ఇచ్చారు. ఫోటోలు దిగే సమయంలోనూ జగన్ పక్కన పెద్దిరెడ్డి లేరు. ఈ పరిణామాలతో జగన్ ఇక పెద్దిరెడ్డిని నమ్మడానికి రెడీగా లేరన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. గతంలో మిధున్ రెడ్డి తాడేపల్లిలో ఎక్కువ కనిపించేవారు. ఇప్పుడు కనిపించడం తగ్గిపోయిందని గుర్తు చేస్తున్నారు.