జగన్ రెడ్డి తాను న్యాయవ్యవస్థ కంటే గొప్ప వ్యక్తినని ఆ వ్యవస్థను ఎలాగైనా కించ పరిచి తన డిమాండ్ ను నెరవేర్చకునేందుకు సిద్దంగా ఉన్నానని నిరూపించేందుకు మరో ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పిటిషన్ను దిగువ కోర్టులో కొట్టేస్తే అప్పటికప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. హైకోర్టు విచాణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది. ఇదంతా ఒక్క రోజులో జరిగిపోయింది.
జగన్ రెడ్డి తన కుమార్తె గ్రాడ్యుయేషన్ ఉందన్న పేరుతో విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చినా విదేశాలకు వెళ్లలేరు. ఎందుకంటే ఆయన పాస్పోర్టు తీసుకోలేదు. గతంలో డిప్లమాట్ పాస్పోర్టు ఉండేది. సీఎం పదవి పోగానే అది రద్దు అయింది. దీంతో మామూలు పాస్పోర్టు తీసుకోవడానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. కానీ తప్పుడు రాజకీయాల కారణంగా చేసిన నిర్వాకాల వల్ల టీడీపీ నేత నారాయణ దాఖలు చేసిన ఓ పిటిషన్ దిగువకోర్టులో విచారణలో ఉంది. ఇతర కేసుల్లో ఆయనకు ఎన్వోసీ వచ్చినా ఈ కేసులో మాత్రం ఆయన కోర్టుకు హాజరై పూచికత్తు సమర్పించాల్సి ఉంది. కానీ అలా కోర్టుకు హాజరు కావడాన్ని నామోషీగా భావిస్తున్నారు.
అందుకే గతంలో కుమార్తె పుట్టినరోజు వేడుకలకు లండన్ పోతానంటూ పర్మిషన్ తీసుకుని ఈ ఈగో కారణమంగానే ఆగిపోయారు. మళ్లీ ఇప్పుడు గ్రాడ్యూయేషన్ డే కి వెళ్లలాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు అయినా కింది కోర్టుకు వెళ్లి పూచికత్తు సమర్పిస్తే పోయేదానికి ఆయన తాను ఏంటి.. కోర్టుకు వెళ్లడం ఏమిటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు వేస్తున్నాయి. అయినా ఓ నిందితుడు న్యాయవ్యవస్థతో ఇలా ఆటాలడుకుంటూంటే.. ఏ హైకోర్టు అయినా నిందితుడికి కోర్టుకువెళ్లాల్సిన అవసరం లేదని రిలీఫ్ ఇస్తుందా ?.
జగన్ మోహన్ రెడ్డిమాజీ ముఖ్యమంత్రి కావొచ్చు కానీ ఆయన అన్ని వ్యవస్థలకూ జవాబుదారీగా ఉండాలి. వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఈగోలకు పోతే తాత్కాలిక విజయాలు వస్తాయేమో కానీ ఆ వ్యవస్థలు పవర్ చూపించినప్పుడు… చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.