తల్లి, చెల్లిని కోర్టుకు లాగిన్ జగన్ అని అందరూ చెప్పుకుంటున్నారు కానీ.. తన అక్రమాస్తుల కేసులో వైఎస్ ను ఇరికించి తాను తప్పించుకోవాలని జగన్ రెడ్డి వేసిన ప్లాన్ గురించి ఎక్కువగా చర్చకు రావడం లేదు. కానీ ఆయన చేసిన నిర్వాకన్ని గతంలో షర్మిల.. అంతకు ముందు ఉండవల్లి కూడా బయట పెట్టారు.
YSR పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్ బయటకు రావడం అసాధ్యం అనుకున్నారని.. . YSR పేరును CBI లో చేర్చాలని హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐ కోర్టులో పిటిషన్లు వేయించారు. ఈ పిటిషన్లు వేసింది జగన్ రెడ్డి ఆత్మీయ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జగన్ కోసం సుధాకర్ రెడ్డి పిటీషన్ లు వేశారు. చార్జీ షీట్ లో వైఎస్ఆర్ పేరు పెట్టించారు. దానికి ప్రతిఫలంగా పదవి జగన్ ఇచ్చారు.
CBI కోర్టు, హై కోర్టు సుధాకర్ రెడ్డి పిటిషన్ లను కొట్టేసింది. సుప్రీం కోర్టు మాత్రం విచారణ జరగనివ్వండి అని చెప్పింది. ఉండవల్లి కూడా అదే చెప్పారు. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చి పేరు నమోదు చేయించారు అని ఉండవల్లి తనతో చెప్పారని షర్మిల ఇటీవల ప్రకటించారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును చార్జిషీట్ లో పెట్టించినందుకే పొన్నవోలుకి జగన్ ఆరు రోజుల్లో పదవి ఇచ్చారని షర్మిల ఆరోపించారు. అసలు పొన్నవోలు అనే లాయర్ ఎవరో ప్రపంచానికి కూడా తెలియదన్నారు.
చనిపోయిన తండ్రిని ఎఫ్ఐఆర్లో పెట్టించారంటూ జగన్ రెడ్డి .. కాంగ్రెస్ హైకమాండ్ పై చాలా రాజకీయం చేశారు. కానీ అసలు చనిపోయిన వైఎస్ లను చార్జిషీట్‌కు ఎక్కించింది జగన్. తండ్రి మీద కేసులు పెట్టిన వారికి ఎవరైనా పదవి ఇస్తారా అని మండిపడ్డారు. ఇప్పుడు నేరుగా షర్మిల, విజయమ్మనే కోర్టుకు లాగారు. ఆయన మనస్థత్వం గురించి ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది.