చంద్రబాబును ముసలాయన.. ముసలాయన అని జగన్ రెడ్డి ఎగతాళి చేస్తూంటారు. ఆ ఒక్క ముసలాయన బలం ఏమిటో ఆయనే ప్రజల ముందు పెడుతున్నారు. నాలుగున్నరేళ్లకు ఏ ఆధారాలు లేని కేసులో వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తే కానీ ఆయనను జైల్లో పెట్టలేకపోయారు. అత్యంత ఘోరంగా ఎన్నికల్లో ఓడిపోయి ఇటు అసెంబ్లీలో… అటు ఢిల్లీలో బలం లేకుండా నిస్సహాయుడిగా ఉండిపోయినా ఏమీ చేయలేకపోయారు. చివరికి పేరు లేని ఎఫ్ఐఆర్ లో… అవినీతి చేశారో.. దుర్వినియోగం చేశారో చెప్పలేని కేసులో.. అసలు నేరుగా సీఎంకు సంబంధం ఉండని కేసులో అరెస్ట్ చూపించవచ్చు. ఇది ఆయనను దెబ్బకొట్టడం అవుతుందో.. లేకపోతే ఆయన బలాన్ని ప్రజల ముందు ఉంచడం అవుతుందో ఎవరికైనా అర్థం అవుతుంది.
చంద్రబాబు కులం, ప్రాంతం పేరుతో ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. ఆయన రాజకీయం అభివృద్ది సెంట్రిక్ గా ఉంటుంది. అది ఆయన బలహీనత. తాను అభివృద్ది చేస్తానని… ప్రజలను… వారి కుటుంబాలకు మెరుగైన జీవితాన్ని కల్పించేలా ఆయన పాలనా విధానాలు ఉంటాయి. అధికారంలో ఉంటే పార్టీని కూడా పట్టించుకోరు. అది ఆయన బలమో బలహీనతో. కానీ ఆయనను దెబ్బకొట్టాలంటే… మాత్రం… ఆషామాషీ కాదు. ఇంటికి లక్షలు పంచాలి… వేధించాలి.. మానసికంగా దెబ్బకొట్టాలి… ఇన్ని చేసినా ఏం జరుగుతుంది… ఆయన గట్టిగా నిలబడుతున్నారు. అన్ని వ్యవస్థల్ని వాడుకుంటే…. ఢిల్లీ స్థాయిలో మద్దతు లభిస్తేనే ఆయనను జైలుకు పంపగలిగారు కానీ.. ఆయన పోరాటాన్ని ఆపలేరు కదా.
చంద్రబాబు కూడాజైలుకు వెళ్తున్నారు.. ఇక నేను నిప్పును అని చెప్పుకోవడానికి చంద్రబాబుకు అవకాశం లేదని… కొంత మంది మేధావులు సంతృప్తి పడుతూంటారు. ఆయన నిజాయితీని నమ్మేవారు…. ఎవరూ జైలుకు పంపినంత ఆయన నిప్పు కాదని నమ్మరు. ఆయన ప్రోత్సాహంతో చరిత్ర సృష్టించిన నాటి డెక్కన్ ఏవియేషన్ గోపీనాథ్ దగ్గర్నుంచి నేటి జోహో అధిపతి వరకూ అందరూ ఆయనను గుర్తుంచుకుంటారు. నిజాయితీపరుడిగానే. ఆయన అవినీతి పరుడని నమ్మిన వారు.. ఆయనేం చెప్పిన నమ్మరు.
ఒక్క ముసలాయన్ని కొట్టడానికి ఎంత పెద్ద స్థాయిలో వ్యవస్థల దుర్వినియోగం జరిగిందో…..అదే ఆయన అసలైన బలం. దటీజ్ ముసలాయన . ఈ రోజు ఇంతటితో ఆగిపోదు. రేపు అనేది లేకుండా పోదు. కాలమే అన్నింటికీ సాక్ష్యం.