ఈనాడులో వచ్చే కథనాలు తప్పు అని చెప్పడానికి ప్రత్యేకంగా ఓ ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని జగన్ రెడ్డి ప్రారంభింపచేశారు. రోజూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఈనాడులో వచ్చే కథనాలకు వివరణలు ఇస్తున్నారు. అయితే ఫేక్ అని ఒక్క స్టోరీకి కూడా ఖారఖండిగా చెప్పడం లేదు. అలాంటి అవసరం రావట్లేదని.. మిస్ లీడింగ్ అనే స్టాంప్ రెడీ చేసుకుని దాన్నే వాడుతున్నారు. అయితే ఈ వాదన అయినా బలంగా వినిపిస్తున్నారా అంటే.. .. ఆవు కథలు చెప్పి నమ్మించాలని చూస్తున్నారు కానీ.. ఈనాడు కథనాన్ని సూటిగా, సుత్తి లేకుండా ఖండించలేకపోతున్నారు. ఇదంతా ఎందుకు అంటే… ఈనాడు కథనం కరెక్టేనని అంగీకరిస్తూ.. అందులోనే వారు ఏదో ఓ చోట అంగీకార స్టేట్ మెంట్ ఇస్తున్నారు. నిజంగా ఈనాడు కథనం… ఫ్యాక్ట్ చెక్ మిస్ లీడింగ్ కథనం చదివితే.. ఈనాడు రాసింది కూడా అదే కదా అన్న డౌట్ వస్తుంది.
గత నాలుగేళ్లలో వరి పంట విస్తీర్ణం అసలు పెరగలేదని.. తెలంగాణలో డబుల్ అయిందని ఈనాడు కథనం రాస్తే.. దానికి ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. నాలుగేళ్ల కిందట ఉన్నంత వరి ధాన్యం ఉత్తత్తే ఉందని తేల్చారు. కానీ ఆరున్నర శాతం పెరిగిందన్నారు. అదే లెక్కలు చెప్పి.. ఆరున్నర శాతం ఎలా పెరిగిందో కానీ… మొత్తం ఫ్యాక్ట్ చెక్ లో… మసిపూసి మారేడు కాయ చేశారని సంబంధం లేని అంశాలతో రైతు భరోసా, ఆర్బీకే అంటూ… ఆవు కథలు చెప్పారని అర్థమయిపోతుంది.
అలాగే ఓ వికలాంగులారికి పించన్ తొలగించడంతో ఆత్మహత్య చేసుకుందని ఈనాడు స్టోరీ రాసింది. దానిఫై ఫ్యాక్ట్ చెక్ చేసిన మిస్ లీడింగ్ వివరణలో… నిజమేపెన్షన్ తొలగించామని ఒప్పుకున్నారు. ఆమె వీల్ చైర్ కే పరిమితమయిందని ఒప్పుకున్నారు. ఆమె తల్లి ఓ ఆయాగా ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారని ఒప్పుకున్నారు. అదే సమయంలో వారికి మూడు ఇళ్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఆ ఇళ్లు వారివి కావనే నిజాన్ని తెలిసినా దాచేశారని వారి మాటల్లోనే స్పష్టమయింది. ఇంకా ఆమె ఆత్మహత్యకు కారణం పెన్షన్ తీసేయడం కాదని… కుటుంబ కలహాలు … తలనొప్పి అని కూడా వాదించారు. ఈ ఫ్యాక్ట్ చెక్ చూసిన ఎవరికైనా .. చివరికి వైసీపీ వారికైనా ప్రభుత్వం మీద అసహ్యం వేస్తుంది.
ఈ ఫ్యాక్ట్ చెక్ .. నిజంగానే ఫ్యాక్ట్ చెక్ చేయడం లేదు. ఈనాడు రాసిన కథనాల్ని సర్టిఫై చేస్తూ నిజమేనని అంగీకరిస్తుననట్లుగా ఉంది. అందుకే… వైసీపీ నేతలు కూడా ఈ ఫ్యాక్ట్ చెక్‌లను పట్టించుకోవడం మానేశారు.