పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించానని జగన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చారు. నిజానికి ఆయన అప్పటికే శంకుస్థాపన మాత్రమే చేశారు. ఆ పేరుతో అప్పులు తెచ్చారు. తర్వాత అతి కష్టం మీద మూడింటికి పర్మిషన్ వచ్చింది. ఈ విద్యాసంవత్సరం నుంచి మరో ఐదు కాలేజీలకు పర్మిషన్ వస్తుందని ప్రచారం చేశారు. తీరా .. మెడికల్ కౌన్సిల్ వాళ్లు పరిశీలన చేస్తే.. . మెడికల్ కాలేజీలకు నిర్వహించే సామర్థ్యం లేదని తేల్చేశారు. సీట్లను భర్తీ చేసేందుకు అనుమతి నిరాకరించారు.
అనుమతి దక్కని ఐదు మెడికల్ కాలేజీల్లో పులివెందుల మెడికల్ కాలేజీ కూడా ఉంది. ముందు వైపు మొత్తం పెయింటింగ్ తో సహా ఎలివేషన్ పూర్తి చేసి మీడియాలో ఫోటోలు వేసుకుని గొప్పగా రెడీ అయిపోయిందని ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే సినిమా సెట్టింగ్లా వెనుకవైపు అంతా డొల్ల. అంతేనా… ఫ్యాకల్టీ ఉండాలిగా.. వాళ్లు కూడా లేరు. ఏ మాత్రం అనుభవం లేని అర్హత లేని వాళ్లను ఫ్యాకల్టీగా చూపించే ప్రయత్నం చేయడంతో మెడికల్ కౌన్సిల్ పర్మిషన్లు ఇవ్వలేదు.
ఇప్పుడు ఈ ఐదు మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం కిందా మీదా పడాల్సిన పరిస్థితి. జగన్ రెడ్డి హయాంలో చేసిన తప్పులన్నింటినీ దిద్ది.. మెడికల్ కౌన్సిల్ కు నమ్మకం కలిగించి… అనుమతులు తెచ్చుకోవాలి. చేసే పనిలో చిత్తశుద్ధి లేకుండా చెప్పుకోవడానికే చేసే పనుల్లా జగన్ రెడ్డి నిర్వాకం జరిగిపోయింది. ఇప్పుడు వాటిని సరి చేసుకోవాల్సిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం పడిపోయింది.