జనవరి నుంచి ఊరూరా వెళ్లి ఉత్తుత్తి బటన్లు నొక్కిన జగన్ రెడ్డి ఇప్పుడు పోలింగ్ రోజు వారి ఖాతాల్లో డబ్బులేసి ఓట్లు దండుకోవాలనుకున్నారు. ఈసీని మ్యానేజ్ చేసుకోవచ్చనుకున్నారు. అందుకే వచ్చిన డబ్బులు.. అప్పులు తెచ్చిన డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. ఇప్పుడు లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలంటే.. పోలింగ్ ముగియాలని ఈసీ చెప్పింది. కోర్టుకు వెళ్లినా ఈసీ చెప్పినట్లుగా చేయమని స్పష్టం చేసింది. మరోసారి ప్రభుత్వం నుంచి అప్లికేషన్ తీసుకున్నా… అత్యవసరంగా నిధులు జమ చేయాల్సిన అవసరం లేదని .. పోలింగ్ ముగిసిన తర్వాతనే చేయమని ఈసీ స్పష్టం చేసింది.
అంటే పథకాల లబ్దిదారులకు జగన్ జెల్లకొట్టినట్లే. కోడ్ రాక ముందే అందరి ఖాతాల్లో వేస్తే మర్చిపోతారని అనుకున్నారేమో కానీ పోలింగ్ రోజు లేదా ముందు రోజు వేద్దామనుకున్నరు.ఇప్పుడు ప్లాన్ రివర్స్ అయింది. ఓటు దాటాక అందరూ బోడి మల్లన్నలే. ఓటింగ్ పూర్తయిన తర్వాత జగన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయరు. ఏమైనా ఉంటే.. తమ అస్మదీయ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకుంటారు.
గతంలో ఇలాగే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో.. పారిశ్రామిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై రగడ జరిగింది. కోడ్ అడ్డం ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చినా ఇవ్వలేదు. ఇలాంటి విన్యాసాలు జగన్ రెడ్డి చాలా చేశారు. అందుకే పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్క రూపాయి కూడా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే అవకాశమే లేదు. పోలింగ్ ముగియగానే ఆయన కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తున్నారు. కౌంటింగ్ నాటికి కూడా వస్తారో లేదో ఎవరికీ తెలియదు.