మోసం చేస్తున్నా అని చెప్పి మరీ మోసం చేయడం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు శంకుస్థాపనలు చేయడం, భర్తీ చేయలేని ఉద్యోగాల ప్రకటనలు చేయడం పచ్చి మోసమని… చిత్తశుద్ధ ఉంటే ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల్లోపు అన్నీ పూర్తి చేయాలని జగన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఆయన తన మాటలకు తగ్గట్లుగానే పచ్చి మోసం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జగత్మోసం చేస్తన్నారు. ఎన్నికల షెడ్యూల్ మరో నెలలో వస్తుందని తెలిసి ఉత్తుత్తి శంకుస్థాపనలు, ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నారు.
ఎన్నికల్లోపు నియామక ప్రక్రియ పూర్తి కాని విధంగా ఉండేలా గ్రూప్స్ ప్రకటనలు ఇప్పటికే ఇచ్చారు. వాటికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా సహకరించని విధంగా వెబ్ సైట్ ను తీర్చిదిద్దారు. ఇప్పుడు మెగా డీఎస్సీ ఇస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు డీఎస్సీ ఇస్తే.. ఎన్నికల నాటికి కనీసం పరీక్ష కూడా పెట్టలేరు. ఎన్నికల్లో జగన్ రెడ్డీ హామీ ప్రకారం మెగా డీఎస్సీ మొదటే ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రకటిస్తున్నారు. మేము మామూలు మామూలుగానే మోసం చేస్తాం.. ఇక ఎన్నికలకు ముందు చూసుకోండి మల్ల అన్నట్లుగా ప్రజల్ని… నిరుద్యోగుల్ని చాలెంజ్ చేస్తున్నారు. జగన్ రెడ్డి తన మాటల్ని తనకే అన్వయించేలా గతంలో చేసిన ప్రకటనలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అయినా జగన్ రెడ్డి సిగ్గుపడటం లేదు. తనను అడ్డగోలుగా నమ్మే ఓటు బ్యాంక్ ఉంటుందని తాను మోసం చేసినా వారు ఓట్లేస్తారని ఆయన నమ్మకం. కానీ ప్రజలు ఎంత తెలివైన వారో ఆయనకు వచ్చే ఎన్నికల్లో నిరూపిస్తారు. ఒకసారి మోసపోయారని ప్రతీ సారి మోసపోమని గుర్తు చేస్తామని చెబుతున్నారు.