ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ విదేశాలకు వెళ్తానని అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.గతంలో ఆయన తన కుమార్తెల పుట్టిన రోజు సందర్భంగా విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు. సీబీఐ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. కానీ ఆయన వెళ్లలేదు. ఆయన పాస్ పోర్టు విజయవాడ కోర్టులో లిటిగేషన్లో పడింది.
సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు డిప్లొమాట్ పాస్ పోర్టు ఉండేది. ఓడిపోయాక దాన్ని సరెండర్ చేసి తన పర్సనల్ పాస్ పోర్టు తీసుకున్నారు. అక్రమాస్తుల కేసుల్లో ఆయనపై ఉన్న కేసులుతో పాటు అధికారంలో ఉన్నప్పుడు తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ప్రస్తుత మంత్రి నారాయణ.. గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు దాఖలుచేసిన పరువు నష్టం కేసు కూడా కోర్టుల్లో విచారణల్లో ఉన్నాయి. మిగతా కేసుల్లో ఇబ్బంది లేనప్పటికీ నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మాత్రం కోర్టుకు స్వయంగా హాజరై పూచికత్తు సమర్పించాల్సి ఉంది.
కానీ ఈగోకు పోయిన జగన్ .. కోర్టుకు హాజరు కాలేదు. పాస్ పోర్టు తీసుకోలేదు. చివరికి కుమార్తెల పుట్టిన రోజు వేడుకలకు విదేశాలకు వెళ్లకుండా ఉన్నారు. ఇప్పుడు మరోసారి సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేశారు. సీబీఐకోర్టు అంగీకరించినా మళ్లీ ఆయన దిగువ కోర్టుకు పోయి పూచికత్తు సమర్పిస్తేనే పాస్ పోర్టు వస్తుంది. అయితే ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అ కేసు పెండింగ్ లో ఉంది. అంటే తన పంతం వీడి కోర్టును గౌరవించి దిగువకోర్టుకు వెళ్లి పూచికత్తులు సమర్పిస్తేనే ఆయనకు పాస్ పోర్టు వస్తుంది. లేకపోతే సీబీఐ కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నా ప్రయోజనం ఉండదు.